BigTV English

Robots : కూలీలు ఉండరు.. ఇక అన్నీ రోబోలే..

Robots : కూలీలు ఉండరు.. ఇక అన్నీ రోబోలే..

robots : రోజు రోజుకీ సాంకేతిక పరిజ్ఞానం మారిపోతున్న ఈ స్పీడ్ యుగంలో రోబోల వాడకం పెరిగిపోయింది. తయారీరంగం మొదలుకుని అసెంబ్లీ/ప్యాకింగ్, రవాణా, పరిశోధన, పారిశ్రామిక, వైద్య రంగాల వరకు ఎక్కడ చూసినా అవే.ఆటోమేషన్ అవసరమైన ప్రతి చోటా రోబోలు కనిపిస్తున్నాయి.


కంప్యూటర్ సాయంతో పనిచేసే యంత్రాన్నే రోబో అని చెప్పుకోవచ్చు. రోబోటా అనే పదం నుంచి ఇది వచ్చింది. చెక్ భాషలో రోబాటా అంటే బానిస కార్మికుడని అర్థం. నాటక,నవలా రచయిత, జర్నలిస్టు కేరెల్ చాపెక్(Karel Čapek) తొలిసారిగా రోబాట్ పదాన్ని వినియోగించారు.

వాస్తవానికి ఆయన సోదరుడు జోసెఫ్ చాపెక్ ఈ పదాన్ని కనుగొన్నాడనే వాదన కూడా ఉంది. రాండమ్ ఆప్టికల్ బైనరీ ఆస్సిలేటింగ్ టెక్నాలజీ(ROBOT)కి సంక్షిప్త నామమే రోబాట్. రోబోల అధ్యయనాన్ని రోబోటిక్స్‌గా వ్యవహరిస్తారు. అమెరికన్ రచయిత, బోస్టన్ వర్సిటీ బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ ఐజాక్ అసిమోవ్ తన సైన్స్ ఫిక్షన్ రచనల ద్వారా రోబోటిక్స్ పదానికి విస్తృత ప్రాచుర్యం కల్పించారు.


ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ లెక్కల ప్రకారం నిరుడు 5,53,000 ఇండస్ట్రియల్ రోబోలు కొత్తగా రంగప్రవేశం చేశాయి. దీంతో 2022 చివరి నాటికి మొత్తం ఇండస్ట్రియల్ రోబోల సంఖ్య 39 లక్షలకు చేరింది.

కొత్త రోబోల్లో దాదాపు మూడొంతులు అంటే 73% ఆసియా దేశాల్లోనే వినియోగంలోకి వచ్చాయి. రోబోలకు ప్రధాన మార్కెట్ అయిన చైనాలోనే సగానికి పైగా.. అంటే 2.9 లక్షల కొత్త రోబోలు వివిధ పరిశ్రమల్లోకి అడుగుపెట్టాయి. ప్రపంచంలోని మిగిలిన అన్ని దేశాల్లో 2.63 లక్షల కొత్త రోబోలు రంగప్రవేశం చేశాయి.

రెండో స్థానంలో ఉన్న జపాన్‌లో నిరుడు కొత్తగా 50 వేల రోబోలొచ్చాయి. 40 వేల రోబోలతో అమెరికా మూడో స్థానంలో ఉంది.
దక్షిణ కొరియాలో 32 వేలు, జర్మనీ 26 వేలు, ఇటలీ 12, తైవాన్ 8, ఫ్రాన్స్‌లో 7వేల పారిశ్రామిక రోబోలు కొత్తగా వచ్చి చేరాయి.

పారిశ్రామిక రోబోల తయారీకి జపాన్ పెట్టింది పేరు. నిరుడు ఉత్పత్తి అయిన రోబోల్లో 46% వాటా ఆ దేశానిదే. దక్షిణ కొరియా తయారీరంగంలో ప్రతి 10 వేల మంది కార్మికులకు వెయ్యి రోబోలు ఉండగా.. జపాన్‌లో 399, చైనాలో 322 రోబోలు ఉన్నాయి.

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×