E-Paper
Advertisement

Indian Railways: కూర్చున్న చోటుకే ఆహారం.. రైల్వే సరికొత్త సదుపాయం, ఇలా చేస్తే చాలు!

Indian Railways: కూర్చున్న చోటుకే ఆహారం.. రైల్వే సరికొత్త సదుపాయం, ఇలా చేస్తే చాలు!
Advertisement

IRCTC e-Pantry Services: ప్రయాణీకులకు మెరుగైన సర్వీసులు అందించడమే లక్ష్యంగా భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణ అనుభవాన్ని మరింత మెరుగు పరిచేందుకు కోసం, ప్రయాణీకులు నచ్చిన ఫుడ్ సీటు దగ్గరే డెలివరీ తీసుకునే ఏర్పాట్లు చేసింది. 25 మెయిల్, ఎక్స్‌ ప్రెస్ రైళ్లలో IRCTC ఈ-ప్యాంట్రీ సేవలను ప్రారంభించింది. ప్రయాణీకులు టికెట్ బుకింగ్ సమయంలో లేదంటే ఆ తర్వాత ఆన్‌ లైన్‌ లో ఫుడ్ ఆర్డ్ చేసుకోవచ్చు. ప్రయాణీకుల సీటు దగ్గరే ఫుడ్ డెలివరీ అవుతుంది. ఇంతకీ ఈ సర్వీసును ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్

ప్రయాణీకులకు తాజాగా ఈ గుడ్ న్యూస్ చెప్పింది IRCTC. ఎంపిక చేసిన రైళ్లలో ఆన్‌ లైన్‌ లో ఫుడ్ ఆర్డర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. IRCTC  కొత్త ఈ-ప్యాంట్రీ సర్వీసు ప్రస్తుతం 25 రైళ్లలో అందుబాటులో ఉంది. ప్రయాణీకులు రైలు  ఎక్కే ముందు భోజనం బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మొదట వివేక్ ఎక్స్‌ ప్రెస్‌ లో ఈ సర్వీసుకు సంబంధించి ట్రయల్ టెస్ట్ చేశారు. సక్సెస్ కావడంతో 25 రైళ్లకు విస్తరించారు. ఈ సేవ టికెట్ ధరలో భోజనం లేని రైళ్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. IRCTC వ్యవస్థకు లింక్ చేయబడిన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి ముందుగానే ఆహారాన్ని బుక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే?  

Advertisement

కన్ఫార్మ్ టికెట్ లేదంటే RAC టికెట్ హోల్డర్లు భోజనంతో పాటు వాటర్ ను బుక్ చేసుకోవచ్చు. తమ సీట్ల దగ్గరే వాటిని డెలివరీ తీసుకోవచ్చు. ఈ వ్యవస్థ పారదర్శకతను పెంచుతుంది. డెలివరీని నిర్ధారించడానికి మీరు మీల్ వెరిఫికేషన్ కోడ్ (MVC) పొందుతారు.

ప్రయాణ సమయంలో ఫుడ్ ఎలా బుక్ చేసుకోవాలంటే?  

బుకింగ్ చేస్తున్నప్పుడు లేదంటే ఆ తర్వాత ‘బుక్డ్ టికెట్ హిస్టరీ’ ద్వారా IRCTC సైట్/యాప్‌ లో ఇ-ప్యాంట్రీ  సర్వీసును ఉపయోగించుకోవచ్చు. మీ భోజనం కోసం డెలివరీ సిబ్బందికి చూపించడానికి మీకు నిర్ధారణ కోసం MVC కోడ్ లభిస్తుంది. ఫుడ్ డెలివరీ సమయంలో ఆ కోడ్ ను సిబ్బందికి చెప్తే సరిపోతుంది.

Advertisement

Read Also:  స్లీపర్ క్లాస్ టికెట్ తో ఏసీలో ప్రయాణించాలనుందా? సింపుల్ గా ఇలా చేయండి!

ఇ-ప్యాంట్రీ సౌకర్యం ఏ రైళ్లలో ఉంది?

ఇ-ప్యాంట్రీ సర్వీసు ఇప్పుడు 25 మెయిల్, ఎక్స్‌ ప్రెస్ రైళ్లలో ఉంది. వీటిలో వివేక్, పశ్చిమ్ ఎక్స్‌ ప్రెస్ లాంటి అధిక డిమాండ్ ఉన్న మార్గాలు కూడా ఉన్నాయి. ప్రయాణీకుల అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వీసును ఇతర రైళ్లకు విస్తరించాలని IRCTC భావిస్తోంది.

Read Also: ప్రయాణీకులకు గుడ్ న్యూస్, వందేభారత్ స్లీపర్ లో ఇక ఎమర్జెన్సీ కోటా టికెట్లు!

Related News

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

Big Stories

Advertisement
×