E-Paper
Advertisement

Congress Final List : కాంగ్రెస్ పార్టీ తుది జాబితా విడుదల.. ఆ స్థానంలో అనూహ్య మార్పు!

Congress Final List : కాంగ్రెస్ పార్టీ తుది జాబితా విడుదల.. ఆ స్థానంలో అనూహ్య మార్పు!
Advertisement

Congress Final List : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఐదుగురు సభ్యులతో తుది జాబితా విడుదల చేసింది. మొదటి మూడు జాబితాలో 114 స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్రకటించిన విషయం తెలిసిందే. తుది జాబితాలో అధిష్ఠానం పటాన్‌చెరు నియోజకవర్గంలో అనూహ్య మార్పు చేసింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్‌కు పటాన్‌‌చెరు స్థానాన్ని కేటాయిస్తున్నట్లు ముందుగా ప్రకటించింది. కాగా తుది జాబితాలో ఆ స్థానాన్ని కాటా శ్రీనివాస్ గౌడ్ కు కేటాయించింది. ఇక సిపిఎంతో పొత్తు ఉంటుందని.. మిర్యాలగూడ స్థాన్నాన్ని వారికి కేటాయిస్తారని అనేక ఊహాగానాలు వినిపించాయి. కానీ చివరకు ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ బత్తుల లక్ష్మారెడ్డి కు కేటాయించింది.


ఇక సూర్యాపేట స్థానానికి పటేల్ రమేష్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఈ సీటు ప్రకటన కాంగ్రెస్ పార్టీకి పెను సవాల్ గా మారింది. చివరకు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సూర్యాపేట నుంచి బరిలో ఉండనున్నట్లు అధిష్ఠానం ప్రకటించింది.ఎస్సీ రిజర్వుడు స్థానం అయిన తుంగతుర్తి నియోజకవర్గంలో తీవ్ర పోటీ నెలకొంది. అద్దంకి దయాకర్.. మందుల సామేల్.. పిడమర్తి రవి.. మోత్కుపల్లి నర్సింహులు ఇలా ఎన్నో పేర్లు వినిపించాయి. కానీ చివరకు మందుల సామేల్‌కే అధిష్ఠానం ఆ సీటును కేటాయించింది. ఇక చార్మినార్ నుంచి ముజీబ్ ఉల్లా షరీఫ్ బరిలో దిగనున్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×