E-Paper
Advertisement

తెలంగాణలో ఊపందుకున్న ఎన్నికల వేడి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే, పార్టీ హైకమాండ్ ప్రకటన

తెలంగాణలో ఊపందుకున్న ఎన్నికల వేడి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే, పార్టీ హైకమాండ్ ప్రకటన
Advertisement

Telangana MLCs Elections-2026: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. ఈసారి ప్రధాన పార్టీలు బలమైన అభ్యర్థులను రంగంలోకి దించుతున్నాయి. ఓ వైపు అధికార కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీజేపీ, ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థుల కోసం వడపోస్తున్నారు.అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ ఓ అడుగు ముందుకేసింది. ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది ఆ పార్టీ హైకమాండ్. ఒకరు సామ రామ్మోహన్ రెడ్డి కాగా, మరొకరు సర్వోత్తమ్ రెడ్డి ఉన్నారు.

తెలంగాణలో ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల వేడి

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. జరగబోయే రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు బలమైన అభ్యర్థులను దించుకున్న ప్రధాన పార్టీలు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ స్థానం నుంచి సామ రామ్మోహన్‌రెడ్డి ఖరారు చేసింది. ఇక నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ నియోజకవర్గాల నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డికి ఓకే చేసింది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వీరిద్దరినీ ఎంపిక చేసినట్లు పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

సామ రామ్మోహన్‌రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి పేర్లను ఓకే చేసి పార్టీ హైకమాండ్

Advertisement

తెలంగాణ కాంగ్రెస్‌ మీడియా అండ్‌ కమ్యూనికేషన్‌ వింగ్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు సామ రామ్మోహన్‌రెడ్డి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి కావడం, పార్టీ తరపున వాయిస్ బలంగా వినిపించే నేత కూడా. ప్రసార మాధ్యమాలు నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరొకరు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కుమారుడు సర్వోత్తమ్‌రెడ్డి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి రాజనర్సింహల నేతృత్వంలోని కమిటీ ఆధారంగాకాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వీరిని ఎంపిక చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ పెద్దలను కలిసిన తర్వాత ఈ పేర్లను ఖరారు చేశారు.

ALSO READ: ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీ!

Advertisement

ఈ ఎంపిక వెనుక పెద్ద కసరత్తు జరిగింది. రెండు స్థానాలను వేర్వేరు సామాజికవర్గాలకు ఇవ్వాలనుకుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలు పార్టీ గుర్తులపై కాకుండా అభ్యర్థుల బలాబలాలపై ఆధారపడి జరుగుతున్నాయి. అందుకే గెలిచే అభ్యర్థులనే బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఇక బీజేపీ నుంచి హైదరాబాద్-రంగారెడ్డి -మహబూబ్‌నగర్ జిల్లాల బీజేపీ చీఫ్ రాంచందర్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఒకసారి గెలుపొందడంతో ఈయన అయితే బెటరని పార్టీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. మరోవైపు రేసులో పీవీ మనవడు సుభాష్, పవన్, అమర్నాథ్ లు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇరు పార్టీల అభ్యర్థుల చూసిన తర్వాత నిలబెట్టాలని ఆలోచన చేస్తోంది. బలమైన అభ్యర్థులైతే పోటీ నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

 

Related News

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీ!

డిప్యూటీ సీఎం శాఖలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ సంచలన ఆరోపణలు!

గద్వాల్ మున్సిపాలిటీలో.. ఇద్దరు ఉద్యోగులపై కలెక్టర్ సస్పెన్షన్‌?

పోలీసులు మళ్లీ కొడతారనే భయంతో.. ఓ యువకుడు ఆత్మహత్య!

13 ఏళ్ల బాలుడిపై స్కూల్ టీచర్ లైంగిక దాడి!

ఓయో హోటల్‌లో మహిళ దారుణ హత్య.. పరారీలో యవకుడు!

దొంగ ఓట్లతోనే మోదీ, అమిషా అధికారంలోకి వచ్చారు.. ఆధారాలతో విరుచుకుపడ్డ రఘువీరా రెడ్డి!

Big Stories

Advertisement
×