Khammam Lady SI Incident: సాధారణంగా రాజకీయ నాయకులు, కార్యకర్తలు దూకుడు ప్రదర్శిస్తుంటారు. విపక్ష పార్టీకి చెందిన వారితో బాహా బాహీకి దిగుతుంటారు. ఇక తమ ప్రభుత్వమే అధికారంలో ఉందంటే చెప్పనవసరం లేదు. వారి చేసే పనులకు.. అడ్డూ అదుపు ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అధికారులను సైతం వారు ఎదిరించిన ఘటనలు తరుచూ మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఈ తరహా ఘటనే వెలుగులోకి వచ్చింది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత రెచ్చిపోయాడు. విధి నిర్వహణలో ఉన్న మహిళా కానిస్టేబుల్.. అని కూడా లేకుండా దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఖమ్మం జిల్లా కల్లూరులో ఎస్సైపై దాడి చేశాడు తల్లాడ కాంగ్రెస్ నేత రాము. విధి నిర్వహణలో ఉన్న ఎస్సై హరితపై రాయల రాము దాడి చేశారు. శుక్రవారం అర్ధరాత్రి కల్లూరు ఎన్ఎస్ పీలోని ఓ హోటల్ లో తల్లాడ కాంగ్రెస్ వర్గీయులకు, హోటల్ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. పరోటా విషయంలో హోటల్ సిబ్బందిపై కాంగ్రెస్ నేత రాము దురుసుగా ప్రవర్తించారు.
అసలేం జరిగిందంటే.. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్సైపై.. కాంగ్రెస్ నాయకుడు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా కల్లూరులో చోటుచేసుకుంది. తల్లాడ మండలానికి చెందిన రాయల రాము అనే కాంగ్రెస్ నాయకుడు.. కల్లూరు ఎన్ఎస్పీ సెంటర్లో ఉన్న ఓ హోటల్‌కు వెళ్లి.. అక్కడి సిబ్బందిపై వాగ్వాదానికి దిగారు. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రాము అంతటితో ఆగకుండా తల్లాడలో ఉన్న తన అనుచరుడుతో హోటల్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతో హోటల్ నిర్వాహకుడు కల్లూరు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
వెంటనే ఎస్సై హరిత సిబ్భందితో సంఘటనా స్థలానికి చేరుకుని.. గొడవను ఆపేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎస్సైపై రాము వాగ్వాదానికి దిగారు. అంతేకాదు మహిళా ఎస్సైపై దాడి చేశారు. నానా బూతులు తిడుతూ.. రెచ్చ చేసే ప్రయత్నం చేశారు. అనవసర రాద్ధాంతం చేయవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని చెప్పిన వినలేదు. అధికారపార్టీ నేతనే అడ్డుకుంటారా అన్న రీతిలో హద్దుమీరి ప్రవర్తించాడు.
Also Read: సీఎం రేవంత్ మంచి మనసు.. నాలుగేళ్ల చిన్నారికి ఉచిత వైద్యానికి ఆదేశాలు
దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. కల్లూరు పోలీసులు రామూతో రామూతో పాటు తన అనుచరులు.. ఆరుగురిని అదుపులోకి తీసుకుని పెనుబల్లి పోలీస్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.