CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మంచి మనసు చాటుకున్నారు. వినికిడి లోపంతో బాధపడుతున్న నాలుగేళ్ల చిన్నారికి.. ఉచిత వైద్యం అందించేలా చూడాలని.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వినికిడి లోపం కారణంగా బాధ పడుతున్న.. నాలుగేళ్ల నేతావత్ లిఖితా శ్రీకి తక్షణమే.. ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో.. ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించాలని.. సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నలుగురు పిల్లలతో కలిసి ఆడుతూపాడుతూ గడపాల్సిన ఆ చిన్నారికి.. వినికిడి లోపం శాపంగా మారింది. ఎవరు ఏం చెబుతున్నారో కూడా అర్థం కాక.. అమాయకంగా అలాగే ఉండిపోతోంది. ఆ పాపలో వినికిడి లోపాన్ని గుర్తించిన తర్వాత .. తల్లిదండ్రులు చికిత్స కోసం ఎంతో మంది వైద్యులను సంప్రదించారు. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ తప్పని సరి అని చెప్పడంతో.. అందుకు అవసరమయ్యే ఖర్చును భరించే స్తోమత ఆ కుటుంబానికి లేదు.
కాగా.. ఆ విషయ సీఎం దృష్టికి రాగానే.. వారు మానవత్వంతో స్పందించారు. వెంటనే ఆ చిన్నారికి అవసరమైన పూర్తి వైద్యం.. ఉచితంగా అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చికిత్స జరిగి లిఖిత పూర్తిగా కోలుకోవాలని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
ఇటీవల కూడా వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారుల జీవితాల్లో.. వెలుగు నింపారు రేవంత్ రెడ్డి.. సీఎం రిలీఫ్ ఫండ్‌తో ఆ చిన్నారులకు సర్జరీ చేయించారు. దీంతో చిన్నారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
ఈ చిన్నారులంతా వినికిడి లోపంతో బాధపడేవాళ్లు. ప్రంపంచాన్ని వినలేకపోతున్నామని కుమిలిపోయారు.. కాగా ఈ విషయం కాస్త సీఎం రేవంత్ దృష్టికి వెళ్లింది. వినికిడి లోపం వారి భవితకు శాపం కాకూడదనుకున్నారు. వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా శస్త్ర చికిత్సకు ఆదేశించారు సీఎం.
సీఎం రేనంత్ రెడ్డికి ఆ చిన్నారుల కుటుంబ సభ్యులు.. ధన్యవాదాలు తెలిపారు. జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పారు.
Also Read: కడియంకు కొత్త కష్టాలు.. మాజీ డిప్యూటీ సీఎంకి ఆ పరిస్థితి ఎందుకొచ్చింది?
ఇదిలా ఉంటే.. యాదాద్రి జిల్లాపై వరాల జల్లు కురిపించారు సీఎం రేవంత్‌రెడ్డి. వెయ్యి కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 574 కోట్లతో గంధమల్ల రిజర్వాయర్, 200కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్సియల్ స్కూల్, 183కోట్లతో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. ఆలేరు నియోజకవర్గ ప్రజలకు ఏ అవసరమున్నా చెప్పాలని, ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు సీఎం.