Kannappa movie controversy: కాలం మారుతున్న కొద్ది పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఏదైనా కథను చెప్పాలంటే దర్శకుడు ఎటువంటి బెదురు బెంగా లేకుండా ఆ సినిమా కథని చెప్పేవాళ్ళు. ఏకంగా మాలపిల్ల అనే టైటిల్ పెట్టి సినిమా కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు అదే టైటిల్ పెట్టే సాహసం కూడా ఎవరు చేయలేని పరిస్థితి. రంగస్థలం సినిమాలో గొల్లభామ అనే ఒక పదాన్ని పాటలో రాసినందుకు చాలా రాద్దాంతం జరిగింది. వాల్మీకి అనే పేరును సినిమా టైటిల్ గా పెట్టినందుకు బోయ సంఘాలు మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి ఉదాహరణలు చెప్పడానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. ఈరోజుల్లో మనోభావాలు దెబ్బతినడం అనేది సర్వసాధారణమైన విషయం అయిపోయింది.
కాంట్రవర్సీలో కన్నప్ప
మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం కన్నప్ప. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్స్ కొంతమంది ఈ సినిమాలో కనిపిస్తున్నారు. ప్రతి భాష నుంచి ఒక యాక్టర్ ను ఈ సినిమా కోసం పిక్ చేసి ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచారు. మంచు ఫ్యామిలీ తీసిన సినిమాలు ఆల్మోస్ట్ ప్రేక్షకులు చూడటం మానేశారు అనే క్లారిటీ రావడం వలనే ప్రభాస్ వంటి స్టార్ హీరోను ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో పెట్టారు. ఇకపోతే ప్రస్తుతం కన్నప్ప సినిమాకు సంబంధించి కాంట్రవర్సీ జరుగుతుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం, సప్తగిరి ప్రముఖ పాత్రలలో కనిపిస్తున్నారు. ఈ పాత్రలకు పిలక,గిలక అనే పేర్లను పెట్టారు. దీనిపై బ్రాహ్మణ సంఘాలు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి.
ఆ పాత్రలను తొలగించాలి
గుంటూరుకు సంబంధించిన బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ ఆ పాత్రలను తొలగించారో లేదో క్లారిటీ ఇవ్వాలి అంటూ ప్రశ్నించారు. దీనిపైన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వివరణ ఇచ్చారు. దానికి సి బి ఎఫ్ సి వాళ్లు రిప్లై నోటు కూడా ఇచ్చారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు సెన్సార్ ఏమీ జరగలేదు. సినిమాకు సంబంధించిన ఈవెంట్ ను గుంటూరులో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్లో అయినా ఆ పాత్రలను తొలగిస్తున్నట్లు క్లారిటీ ఇవ్వాలి అని శ్రీధర్ తెలిపారు. అలానే గతంలో కూడా దేనికైనా రెడీ సినిమాకు సంబంధించి బ్రాహ్మణులను కించపరిచారు అంటూ మరోమారు గుర్తు చేశారు. ఇక ఈ విషయంపై కన్నప్ప చిత్ర యూనిట్ యూనిట్ ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతున్న తరుణంలో ఇలాంటి పరిణామాలు జరగడం అనేది ఊహించలేనిది.
Also Read : AA22xA6: క్వీన్ వచ్చేసింది.. కత్తి పట్టి యుద్దానికి సిద్దమైన దీపికా