E-Paper
Advertisement

కాంగ్రెస్‌లో అంతర్గత పోరు.. షబ్బీర్ అలీపై మహిళా నేత ఫైర్.. పోలీసులకు ఫిర్యాదు!

కాంగ్రెస్‌లో అంతర్గత పోరు.. షబ్బీర్ అలీపై మహిళా నేత ఫైర్.. పోలీసులకు ఫిర్యాదు!
Advertisement

Congress Controversy: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ లక్ష్యంగా సొంత పార్టీకి చెందిన మహిళా నాయకురాలు గడ్డం ఇందుప్రియ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీ అధిష్ఠానాన్ని, తోటి నాయకులను విమర్శిస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు మహిళ నేతలతో వెళ్లి కామారెడ్డి జిల్లా ఎస్పీకి షబ్బీర్ అలీపై అధికారికంగా ఫిర్యాదు చేశారు.

టీపీసీసీ జనరల్ సెక్రటరి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య అయిన ఇందుప్రియ.. ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గురించి షబ్బీర్ అలీ తప్పుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. షబ్బీర్ అలీ అన్న కొడుకు తనను అసభ్యంగా ట్రోల్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నాననే తన మీద కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

తన భర్త చంద్రశేఖర్ రెడ్డితో పాటు తాను నిత్యం ప్రజాసేవలోనే ఉన్నానని ఇందుప్రియ అన్నారు. సీనియర్ నాయకుడిని అని చెప్పుకునే షబ్బీర్ అలీ మహిళల పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా? అని మండిపడ్డారు. బయట దేశాల నుండి సోషల్ మీడియా తనపై అసభ్య పోస్టులు వేయిస్తున్నారని మండిపడ్డారు. చర్ల రాజేష్ అనే సీనియర్ నాయకుడిని తాను బాబాయ్ అని పిలుస్తానని ఇందు ప్రియ అన్నారు. అలాంటిది అతను కూడా తన మీద వచ్చిన ట్రోల్స్ ను అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం.. ప్రముఖ కాఫీ షాప్‌నకు భారీ షాక్.. రూ.4 లక్షల ఫైన్!

Advertisement

తన గురించి తప్పుడు ప్రచారం చేసేటప్పుడు మీ ఇంట్లో కోడలు, భార్య గుర్తుకు రాలేదా అని అని ఇందు ప్రియ ప్రశ్నించారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీ అరాచకాల గురించి రాహుల్ గాంధీకి సైతం ఫిర్యాదు చేస్తానని ఆమె హెచ్చరించారు. ఇకనైన తీరు మార్చుకోవాలని ఆమె హితవు పలికారు. మెుత్తం ఈ వ్యవహాం.. కామారెడ్డితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతల్లో తీవ్ర చర్చను లేవనెత్తింది.

Also Read: Jio Rs 195 vs Rs 200 Plan: రూ.5 తేడాతో డబుల్ డేటా.. యూట్యూబ్ ప్రీమియం, 15 ఓటీటీలు ఉచితం!

Related News

తెలంగాణలో వానల విజృంభణ.. నేడు కూడా భారీ వర్షాలు, హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాలకు అలర్ట్

హైదరాబాద్‌లో విషాదం.. మియాపూర్‌ ఓపెన్ నాలాలో పడి వ్యక్తి గల్లంతు! గాలింపు ముమ్మరం

కరీంనగర్​‌‌లో ట్రాఫిక్​ పోలీసుల నయా దందా..!

అవినీతి అనకొండలకు ఇక గజగజ.. బినామీ ఆస్తులపై IT, ACBల డబుల్ స్ట్రోక్!

రేషన్ కార్డు ఉంటే సరిపోదా? మళ్లీ ఈ ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ ఏంటి?

నీట్ లీకేజీపై భగ్గుమన్న ఎంపీ చామల.. బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై తీవ్రస్థాయిలో ధ్వజం!

గద్వాల ప్రభుత్వ కళాశాలలో దారుణం.. లెక్చరర్ రాక్షసత్వానికి విద్యార్థి బలి!

అమెరికా, చైనా సరసన భారత్.. ‘స్కైరూట్’ ఘనతపై సీఎం రేవంత్ హర్షం!

Big Stories

Advertisement
×