E-Paper
Advertisement

థార్ రాక్స్ స్టైల్ స్క్రీన్లతో స్కార్పియో N.. లీక్‌లో బయటపడ్డ క్రేజీ డీటైల్స్!

థార్ రాక్స్ స్టైల్ స్క్రీన్లతో స్కార్పియో N.. లీక్‌లో బయటపడ్డ క్రేజీ డీటైల్స్!
Advertisement

Mahindra Scorpio N Facelift Leaked: మహీంద్రా ప్రముఖ ఎస్‌యూవీ స్కార్పియో Nకు త్వరలో ఫేస్‌ లిఫ్ట్ వెర్షన్‌ అందుబాటులోకి రానుంది. తాజాగా ఈ కొత్త మోడల్ కు సంబంధించిన పలు కీలక వివరాలు లీక్ అయ్యాయి. లేటెస్ట్ మోడల్ లో భారీ మార్పులు లేకపోయినా, కొన్ని కొత్త ఫీచర్లు, అప్‌డేటెడ్ ఇంటీరియర్‌ తో మరింత ఆకట్టుకునేలా రూపొందించారు. వచ్చే నెలలో ఈ ఫేస్‌ లిఫ్ట్ వెర్షన్‌ ను కంపెనీ అధికారికంగా విడుదల చేయనుంది.

డిజైన్ గురించి..

స్కార్పియో N బయటి డిజైన్ తో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. అయితే, కొత్త డిజైన్‌ లో అల్లాయ్ వీల్స్‌ ను అందించనున్నట్లు స్పై షాట్స్ వెల్లడిస్తున్నాయి. ఇవి ప్రస్తుతం ఉన్న మోడల్‌ తో పోలిస్తే మరింత స్టైలిష్‌గా కనిపిస్తున్నాయి. హెడ్‌ ల్యాంప్స్‌ లో స్వల్ప మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. ఫ్రంట్ గ్రిల్, బంపర్, ఫాగ్ ల్యాంప్స్ లాంటి అంశాలు దాదాపు అలాగే కొనసాగనున్నట్లు సమాచారం. వెనుక భాగంలో కూడా ఎలాంటి ప్రధాన మార్పులు కనిపించలేదు. ప్రస్తుత మోడల్‌ లో ఉన్నట్లే LED టెయిల్ లైట్లు, బంపర్, క్రోమ్ ఫినిషింగ్, సిల్వర్ రూఫ్ రైల్స్, బ్లాక్ క్లాడింగ్ లాంటి డిజైన్ ఎలిమెంట్స్ కొనసాగనున్నాయి.

ఆకట్టుకునేలా సరికొత్త ఇంటీరియర్స్

Advertisement

ఈ కొత్త మోడల్ కు సంబంధించి అసలు మార్పులు క్యాబిన్‌లోనే కనిపిస్తున్నాయి. ఇందులో థార్ రాక్స్ మాదిరిగా రెండు 10.25 అంగుళాల స్క్రీన్లు వచ్చే అవకాశం ఉంది. ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం, మరొకటి పూర్తిగా డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లేగా పనిచేయనుంది. అలాగే సెంటర్ AC వెంట్స్‌ ను కొత్తగా అమర్చడంతో పాటు సెంటర్ కన్సోల్‌ లోని స్విచ్‌లకు కూడా కొత్త డిజైన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బ్రౌన్ బ్లాక్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్ థీమ్ మాత్రం యథాతథంగా కొనసాగనుంది.

అదిరిపోయే ఫీచర్లు

ఫీచర్ల పరంగా కూడా స్కార్పియో N మరింత అప్‌డేట్ కానుంది. ఇందులో పనోరమిక్ సన్‌ రూఫ్‌ ను జోడించే అవకాశం ఉంది. అలాగే వైర్‌ లెస్ ఫోన్ ఛార్జింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 12 స్పీకర్ సోనీ ఆడియో సిస్టమ్, పవర్డ్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు కొనసాగనున్నాయి.

ఇంజిన్ గురించి..

Advertisement

ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్న 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లనే మహీంద్రా కొనసాగించనుంది. పెట్రోల్ ఇంజిన్ 203 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుండగా, డీజిల్ ఇంజిన్ వేరియంట్‌ను బట్టి 132 హెచ్‌పీ నుంచి 175 హెచ్‌పీ వరకు శక్తిని అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్‌లకు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉండనున్నాయి. డీజిల్ టాప్ వేరియంట్‌లో 4×4 ఆప్షన్ కూడా కొనసాగనుంది.

ధర ఎంత ఉంటుందంటే?

కొత్త ఫీచర్లు, ఇంటీరియర్ అప్‌డేట్స్ కారణంగా స్కార్పియో N ఫేస్‌ లిఫ్ట్ ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఎస్‌యూవీ ఎక్స్ షోరూమ్ ధర రూ.13.49 లక్షల నుంచి రూ.24.95 లక్షల వరకు ఉంది. విడుదల తర్వాత ఈ మోడల్ మహీంద్రా XUV700, హ్యుందాయ్ అల్కాజర్, టాటా సఫారి, ఎంజీ హెక్టర్ లాంటి ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Read Also: కొత్త ఫీచర్లు.. కొత్త డిజైన్.. ఆగస్టులో వస్తున్న 3 సూపర్ మోడళ్లు ఇవే!

Related News

కొత్త టయోటా హిలక్స్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదా కావాల్సిందే!

కొత్త ఫీచర్లు.. కొత్త డిజైన్.. ఆగస్టులో వస్తున్న 3 సూపర్ మోడళ్లు ఇవే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ డబుల్ గేమ్.. ఒకవైపు ఈవీలు.. మరోవైపు పెట్రోల్ బైక్‌లు!

నిస్సాన్ టెక్టన్, బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ డెలివరీలు స్టార్ట్.. కస్టమర్లకు తాళాలు అందజేత!

ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌ లో సంచలనం.. అవోర్ నుంచి ఒకేసారి ఏకంగా 3 కొత్త మోడళ్లు లాంచ్!

ఫోన్ టచ్ చేయాల్సిన పనిలేదు.. ఈ హెల్మెట్ అన్నీ చూసుకుంటుంది!

టాటా నుంచి రెండు సూపర్ ఈవీలు.. సఫారీ, అవిన్యా రిలీజ్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×