E-Paper
Advertisement

లెనిన్ విషయంలో డిసప్పాయింట్ అయ్యాను – ఎస్. తమన్

లెనిన్ విషయంలో డిసప్పాయింట్ అయ్యాను – ఎస్. తమన్
Advertisement

S.Thaman:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తీసుకున్న ఎస్.తమన్ (S.Thaman) .గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎన్నో చిత్రాలలో చార్ట్ బస్టర్ సాంగ్లను అందించి, మరింత పాపులారిటీ అందుకున్న ఈయన తాజాగా ‘లెనిన్’ సినిమాకి కూడా మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మ్యూజిక్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ సాధించిన నేపథ్యంలో అటు చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించగా.. ఇటు తమన్ కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ లెనిన్ విషయంలో డిసప్పాయింట్ అయ్యాను అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

లెనిన్ సినిమాలో స్పెషల్ సాంగ్..

అఖిల్ అక్కినేని (Akhil Akkineni)హీరోగా, భాగ్యశ్రీ బోర్సే(Bhagya Shri Borse) హీరోయిన్ గా , మురళీ కిషోర్ అబ్బూరు (Murali Kishore abburu)దర్శకత్వం వహించిన చిత్రం లెనిన్. అన్నపూర్ణ స్టూడియోస్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లపై అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamshi) ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతూ దూసుకుపోతోంది. ముఖ్యంగా తమన్ అందించిన సంగీతం ఈ సినిమా విజయానికి కీలక బలంగా నిలిచింది. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో ఎన్నో కమర్షియల్ సినిమాలలో ఐటమ్స్ ఐటమ్ సాంగ్ ఉండడం సాధారణంగా కనిపిస్తోంది . అయితే లెనిన్ చిత్రంలో మాత్రం అలాంటి పాట లేదు. ఇందుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తమన్ పంచుకున్నారు.

పరిశీలనలో ఆ స్టార్ హీరోయిన్లు..

Advertisement

కమర్షియల్ సినిమాలు అనగానే ఐటమ్ సాంగ్ ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైపోయింది. లెనిన్ సినిమాకి కూడా ఐటెం సాంగ్ అనుకున్నాము..దానికోసం నేను ఒక అద్భుతమైన పాటను కూడా సిద్ధం చేశాను. ఈ పాటలో ప్రీతి ముకుందన్ (Preity mukhundhan), రష్మిక మందన్న (Rashmika mandanna), పూజా హెగ్డే(Pooja Hegde) వంటి హీరోయిన్ల పేర్లను కూడా పరిశీలించారు. అయితే చివరికి ఈ పాట కథకు సరిపోవడం లేదని భావించి తొలగించారు. ఈ నిర్ణయంతో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను.

also read:నటి పావలా శ్యామల మృతి.. ఆమె కూతురు ఎక్కడుంది?

చాలా డిసప్పాయింట్ అయ్యాను – తమన్

Advertisement

అంతేకాదు కొన్ని వాట్స్అప్ గ్రూప్ ల నుంచి కూడా నేను ఎగ్జిట్ అయ్యాను. రివ్యూలలో ఐటమ్ సాంగ్ కథకు అడ్డుగా మారింది అనే విమర్శలు రావచ్చనే ఉద్దేశంతోనే మేకర్స్ పాటను తీసేయాలని అనుకున్నారు. నిజానికి ఆ పాట సినిమాలో ఉండుంటే కచ్చితంగా చార్ట్ బస్టర్ అయ్యేది. ఆ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేది. ఆ హామీ నేను ఇస్తాను.. కానీ సినిమా నుండి పాటను తొలగించడం నిజంగా బాధను కలిగించింది” అంటూ కామెంట్ చేశారు. మొత్తానికి అయితే తమన్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

తమన్ సినిమాలు..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న తమన్ ఇప్పుడు స్టార్ హీరోల చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. అందులో భాగంగానే బాలకృష్ణ మూవీ అంటేనే తమన్ అనే పేరు ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. గత కొంతకాలంగా బాలయ్య చిత్రాలకు అద్భుతమైన విజయం అందిస్తూ.. నందమూరి తమన్ అని బాలకృష్ణ చేత పిలిపించుకున్న ఈయన.. ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ కాంబినేషన్లో వస్తున్న ఎన్.బి.కె111 సినిమాకి కూడా సంగీతాన్ని అందిస్తున్నారు . అలాగే చిరంజీవి – బాబి కాంబినేషన్లో వస్తున్న సినిమాకి కూడా తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తుండడం గమనార్హం.

Related News

ఫ్యాన్స్ కోసం మెగా,అల్లు హీరోలేనా.. మరి మిగిలిన హీరోలు?

సాయి పల్లవి కెరీర్‌లో మరో బిగ్ టర్నింగ్.. భారీ సినిమాలో ఛాన్స్!

అమ్మగా ప్రమోట్ అయిన టాలీవుడ్ బ్యూటీ..పాప ఫోటోలు వైరల్!

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత !

ప్రేమలో మోసపోయిన స్టార్ హీరోయిన్లు వీళ్లే!

పావలా శ్యామల మృతిపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ట్వీట్ వైరల్!

మైఖేల్ జాక్సన్ బయోపిక్‌కు ఓటీటీ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్‌కు పండగే!

Big Stories

Advertisement
×