E-Paper
Advertisement

నీట్ లీకేజీపై భగ్గుమన్న ఎంపీ చామల.. బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై తీవ్రస్థాయిలో ధ్వజం!

నీట్ లీకేజీపై భగ్గుమన్న ఎంపీ చామల.. బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై తీవ్రస్థాయిలో ధ్వజం!
Advertisement

Chamala Criticism: నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ అంశంతో పాటు రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని ప్రతిపక్షాల వైఖరిని నిరసిస్తూ ఆయన విమర్శలు గుప్పించారు. మే మొదటి వారంలో నీట్ పేపర్ లీక్ జరిగిందని దీనిపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేయడంతో మోదీ ప్రభుత్వం దిక్కుతోచక చేతులెత్తేసిందన్నారు.

ఎట్టకేలకు జులై చివరి వారంలో కేంద్ర మంత్రితో రాజీనామా చేయించాల్సి వచ్చిందని చామల ఎద్దేవా చేశారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ నీట్ లీకేజీపై సమగ్ర చర్చ జరగాలని, దీనికి జవాబుదారీ ఎవరు అని గట్టిగా ప్రశ్నించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చర్చకు అంగీకరించకుండా పారిపోయిందన్నారు. తెలంగాణలో పేపర్ లీకులు జరుగుతున్నాయంటూ బీజేపీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని చామల మండిపడ్డారు.

Advertisement

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత పారదర్శకంగా, ఒక్క చిన్న తప్పు కూడా జరగకుండా 67 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్పష్టమైన దూరదృష్టి ఉందన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో గ్రూప్-1తో పాటు పదో తరగతి పరీక్ష పేపర్ లీకై లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు నాశనమయ్యాయని గుర్తుచేశారు.

గతంలో బీఆర్‌ఎస్ హయాంలో పేపర్ లీకులు జరిగినప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, కె. లక్ష్మణ్ లలో ఏ ఒక్కరైనా నోరు విప్పి మాట్లాడారా? అంటూ చామల నిలదీశారు. అప్పట్లో బీఆర్‌ఎస్‌తో అంటకాగిన బీజేపీ నేతలు.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లేందుకు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: పావలా శ్యామల మృతిపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ట్వీట్ వైరల్!

ఇక తెలంగాణపై బీజేపీకి ఎలాంటి చిత్తశుద్ధి లేదని ఎంపీ చామల ఆరోపించారు. నాయకత్వం లేక అందరినీ ప్రయత్నించి, చివరికి రామచంద్రరావును రాష్ట్ర అధ్యక్షుడిని చేశారన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ పేపర్ లీకేజీ అంశాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించారని, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు స్పష్టంగా తెలుసని ఎంపీ పేర్కొన్నారు. ఇకనైనా బీజేపీ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, వాస్తవాలు మాట్లాడాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.

Also Read: మాకు రాజకీయాల కంటే.. తెలంగాణ ప్రగతే ముఖ్యం.. దిల్లీలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Related News

రేషన్ కార్డు ఉంటే సరిపోదా? మళ్లీ ఈ ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ ఏంటి?

గద్వాల ప్రభుత్వ కళాశాలలో దారుణం.. లెక్చరర్ రాక్షసత్వానికి విద్యార్థి బలి!

అమెరికా, చైనా సరసన భారత్.. ‘స్కైరూట్’ ఘనతపై సీఎం రేవంత్ హర్షం!

మాకు రాజకీయాల కంటే.. తెలంగాణ ప్రగతే ముఖ్యం.. దిల్లీలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. అధికారులకు కీలక సూచనలు!

మహబూబాబాద్‌ జిల్లాలో హైటెన్షన్.. పెట్రోల్ పోసుకుని రైతు ఆత్మహత్యాయత్నం!

తోటి మహిళా ఆఫీసర్‌పై వేధింపులు.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్!

Big Stories

Advertisement
×