E-Paper
Advertisement

కేబుల్ లేకుండానే కార్‌ ప్లే.. జియో డివైస్ అదిరింది భయ్యా!

కేబుల్ లేకుండానే కార్‌ ప్లే.. జియో డివైస్ అదిరింది భయ్యా!
Advertisement

Wireless CarPlay: కారులో కూర్చున్నాక ఫోన్‌ ను USB కేబుల్‌ తో కనెక్ట్ చేసి ఆండ్రాయిడ్ ఆటో లేదంటే ఆపిల్ కార్‌ ప్లే ఆన్ కావడానికి ఓపికతో వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వెయిటింగ్ అనేది చాలా మందికి విసుగు కలిగిస్తుంది. ఈ వైర్ల గోల లేకుండా, ఈజీగా వైర్ లెస్ కనెక్షన్ కోసం మార్కెట్లోకి వచ్చిన డివైస్‌ జియో కార్‌ సింక్. జియో ప్లాట్‌ ఫారమ్స్‌ కు చెందిన జియోథింగ్స్ రూపొందించిన ఈ చిన్న డాంగిల్ కారులో ఉన్న వైర్డ్ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను వైర్‌ లెస్‌ గా మార్చేస్తుంది.

జస్ట్ రూ. 2,399కే అందుబాటులో..

ప్రస్తుతం ఈ డివైజ్ అమెజాన్‌ లో సుమారు రూ.2,399 ధరకు అందుబాటులో ఉంది. ఒకసారి ఫోన్‌ ను పెయిర్ చేస్తే, ఆ తర్వాత ప్రతి సారి కారు స్టార్ట్ చేసిన వెంటనే ఫోన్ ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతుంది. దీంతో కేబుల్ కనెక్ట్ చేసే అవసరం ఉండదు. అయితే, ఇది అన్ని కార్లలో పనిచేయదు. ఇప్పటికే ఫ్యాక్టరీ ఫిట్ చేసిన వైర్డ్ ఆపిల్ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ ఉన్న కార్లలో మాత్రమే ఉపయోగపడుతుంది. కారులో ఈ రెండు ఫీచర్లలో ఏదీ లేకపోతే జియో కార్‌ సింక్ పని చేయదు. మారుతి బాలెనో, హ్యుందాయ్ క్రెటా, టాటా నెక్సాన్, హోండా సిటీ, స్కోడా స్లావియా, ఎంజీ హెక్టర్ లాంటి అనేక కార్లలో ఈ డివైస్ ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ప్రతిరోజూ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వాడే వారికి చాలా సౌకర్యంగా ఉంటుంది.

జియో కార్‌ సింక్ స్పెసిఫికేషన్లు

Advertisement

ఇందులో బ్లూటూత్ 5.3తో పాటు 5GHz వై ఫై సపోర్ట్ ఉంటుంది. iOS 12, అంతకంటే కొత్త వెర్షన్ ఉన్న ఐఫోన్లు, అలాగే ఆండ్రాయిడ్ 11 లేదా అంతకంటే పై వెర్షన్ ఉన్న ఫోన్లతో ఇది పని చేస్తుంది. USB టైప్-A పోర్ట్ మెయిన్ కనెక్షన్‌ గా ఉండగా, టైప్-C అడాప్టర్ కూడా బాక్స్‌ లో అందిస్తారు. డిజైన్ పరంగా చూస్తే, జియో కార్‌ సింక్ చాలా కాంపాక్ట్‌ గా ఉంటుంది. మెటల్ యూనిబాడీ డిజైన్ కారణంగా ఇది సాధారణ ప్లాస్టిక్ డాంగిళ్ల కంటే కొంచెం ప్రీమియంగా అనిపిస్తుంది. చిన్న సైజ్ ఉండటంతో డాష్‌ బోర్డ్ దగ్గర ఎక్కువ స్థలం కూడా తీసుకోదు.

సెటప్ కూడా ఈజీనే..

ఈ డివైజ్ సెటప్ కూడా ఈజీగానే ఉంటుంది. మొదటిసారి డాంగిల్‌ ను కార్ USB పోర్ట్‌ లో కనెక్ట్ చేసి, ఫోన్‌ ను బ్లూటూత్ ద్వారా పెయిర్ చేయాలి. ఆ తర్వాత ప్రతి సారి ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతుంది. కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటోను ముందుగా ఆన్ చేయాల్సి ఉంటుంది. సో, మొదటి సెటప్ సమయంలో కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కారు స్టార్ట్ చేసిన కొన్ని సెకన్లలోనే కనెక్ట్ అవుతుంది. గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, మ్యూజిక్ స్ట్రీమింగ్, ఫోన్ కాల్స్, వాట్సాప్ వాయిస్ రిప్లయిస్ లాంటి ఫీచర్లు ఈజీగా పని చేస్తాయి. స్టీరింగ్ వీల్ కంట్రోల్స్, టచ్‌ స్క్రీన్, కారులోని మైక్రోఫోన్ కూడా యథావిధిగా పని చేస్తాయి. ఇకపై కేబుల్స్ కు గుడ్‌ బై చెప్పాలనుకునేవారికి జియో కార్‌ సింక్ మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Advertisement

Read Also: ఈ కారు హెడ్‌ లైట్లు సినిమా చూపించేస్తాయ్.. వామ్మో.. ఇదేం టెక్నాలజీ భయ్యా!

Related News

80ల్లో సైకిల్ ఉంటే అదో గొప్ప.. అప్పటి నిబ్బాలు చేసే విన్యాసాలకు నిబ్బీలు ఫిదా!

కారు కాదు.. కదిలే కోట.. జిన్‌పింగ్ హాంగ్‌కీ N701 ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఎండ్ల బండిపై హయ్.. హయ్.. మారుతీ కారులో రయ్ రయ్.. 80’s జర్నీ మరపురానిది!

పెట్రోల్ vs డీజిల్ vs సీఎన్జీ vs ఈవీ.. టాటా నెక్సాన్‌లో ఏది కొంటే లాభం?

హీరో గ్లామర్ X 125 ఇక మరింత సేఫ్.. కొత్త ABS వేరియంట్ వచ్చేసింది!

చేతక్ స్కూటర్ బండి కాదు.. మాటల్లో చెప్పలేని ఎమోషన్.. 80s నాటి మిడిల్ క్లాస్ మెమోరీస్!

రెనాల్ట్ కార్లపై లక్షల్లో ఆఫర్లు.. డస్టర్‌పై ఏకంగా ఎంత డిస్కౌంట్ లభిస్తుందంటే..

కొత్త బాలెనో ధరలు వచ్చేశాయ్.. హైదరాబాద్‌లో టాప్ వేరియంట్ రేట్ ఎంతంటే?

Big Stories

Advertisement
×