Benami Assets: అవినీతి అధికారుల ఆటకట్టేందుకు ఐటీ అధికారులు కొత్త కొరడాను బయటకు తీస్తున్నారు. బినామీ సామ్రాజ్యాల పునాదులు కదిలించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఏసీబీ అధికారుల ప్లాన్ ఏంటి? బినామీలను ఎలా ఐడెంటిఫై చేయబోతున్నారు.
ఇకపై ఆ ఆటలు సాగవు..
ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి ఆనవాయితీ ఐపోయింది. ఫైల్ కాదాలన్నా, సంతకం కావాలన్నా టేబుళ్ల కింద చేతులు తడపాల్సిందే.. అందుకే అవినీతి అధికారుల ఇళ్లకు వెళ్లి.. బీరువా తలుపులు తెరిస్తే చాలు అనంత పద్మనాభస్వామి నిధులు బయటపడుతున్నాయి. కళ్లు చెదిరేలా నగలు, నగదు.. లెక్కలేనన్ని ఫ్లాట్లు, ప్లాట్లు.. ఎకరాలకొద్దీ వ్యవసాయ భూములు.. విదేశాల్లో విల్లాలు. ఇలా అవినీతి అనకొండల బాగోతం బయట పడుతూనే ఉన్నాయి. అవిపోను డ్రైవర్లు, వంటమనుషులు, వాచ్‌మెన్ల పేర్లపై లెక్కలేనన్ని ఆస్తులు. సోదాలు జరిగినప్పుడు ఆ ఆస్తులు మావి కావు, మా బంధువులవి అని తప్పించుకుంటున్నారు. కానీ ఇకపై ఆ ఆటలు సాగవు!
Also Read: తెలంగాణలో టీడీపీ సైలెంట్ ఆపరేషన్.. పొలిటికల్ రీ-ఎంట్రీకి పక్కా స్కెచ్!
అక్రమ దోపిడీకి చెక్..
ఈ అక్రమ దోపిడీకి శాశ్వతంగా చెక్ పెట్టేందుకు IT, ACBలు ఉమ్మడిగా కసరత్తు ప్రారంభించాయి. బినామీ ఆస్తుల లావాదేవీల నిరోధకచట్టం – 1988తో బినామీల గుట్టు విప్పబోతున్నారు. బినామీ ఆస్తి అని ఆధారాలతో తేలితే జప్తు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అవినీతి అధికారుల కొనుగోళ్లు, వారి బినామీల వివరాలతో ఏసీబీ హిట్ లిస్ట్ రెడీ చేసింది. బినామీలను కూడా జైలు శిక్ష, భారీ జరిమానాలు విధించేలా నిబంధనలు తెస్తున్నారు. మరి ఏసీబీ వలకు చిక్కెదెవరు?