E-Paper
Advertisement

Congress Complaint: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. కాంగ్రెస్ శ్రేణులు సీరియస్.. కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు

Congress Complaint: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. కాంగ్రెస్ శ్రేణులు సీరియస్.. కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు
Advertisement

Congress Complaint: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పై కాంగ్రెస్ నాయకులు తొర్రూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, యూత్ కమిటీల ఆధ్వర్యంలో ఎస్సై ఉపేందర్‌కు పిటిషన్ అందజేశారు.

ఫిర్యాదు అనంతరం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా నాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్‌లు మాట్లాడారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలోని గాంధీ సెంటర్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై ఈ స్థాయి మాటలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు.

Advertisement

సీఎం పరువును దిగజార్చేలా మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదని తొర్రూరు కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగత దూషణల స్థాయికి వెళ్లడం ప్రజలు సహించరని హెచ్చరించారు. సంస్కారహీనంగా మాట్లాడిన కేటీఆర్‌ పై తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Also Read: Train – Sandwich: రైలులో శాండ్‌విచ్ చేసుకున్న ఫ్యామిలీ.. నెట్టింట వీడియో వైరల్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

Advertisement

ఆదివారం తొర్రూరులో రోడ్ షో నిర్వహించిన కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు పాలిచ్చే బర్రెను విడిచి.. తన్నె బర్రెను తెచ్చుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు స్టువర్టుపురం దొంగలని.. మరోమారు వాళ్లను నమ్మి మోసపోవద్దని చెప్పారు. గతంలో చాలా మంది సీఎంలను చూశామని.. బూతులు మాట్లాడే సీఎం ఏకైక ముఖ్యమంత్రి చరిత్రలో రేవంత్ రెడ్డి ఒక్కరేనని విమర్శించారు. ఆయన అనముల రేవంత్ రెడ్డి కాదని.. లాగుల తొండల్ రెడ్డి అంటూ ఘాటు విమర్శలు చేశారు.

Also Read: Trending ACs in February 2026: కొత్త ఏసీ కావాలా? ఫిబ్రవరి నెలలో టాప్ ట్రెండింగ్‌ లిస్ట్.. ధర, ఫీచర్లు ఇవే!

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×