KTR : కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. జూన్ 16న విచారణకు పిలిచింది. తాను ఎంక్వైరీకి వస్తానని.. అధికారులకు సహకరిస్తానని కేటీఆర్ చెప్పారు. అక్కడితో ఆగిపోలేదు. సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ సైతం విసిరారు. దమ్ముంటే మన ఇద్దరిపై ఉన్న ఏసీబీ కేసులపై.. లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమా అంటూ ఛాలెంట్ చేశారు. కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చినందునే ఇంతలా ఉలిక్కిపడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు.
కేటీఆర్ బడాయి కబుర్లు!
ఛాలెంజ్‌లు విసిరి పారిపోయిన చరిత్ర కేటీఆర్‌దే అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గతంలో డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో వైట్ ఛాలెంజ్‌కు రావాలని రేవంత్ రెడ్డి పిలిస్తే.. రాకుండా పారిపోయిన చరిత్ర కేటీఆర్‌దని గుర్తు చేశారు. ఫార్ములా-ఈ రేస్ కేసులో ఏసీబీ నోటీసులు ఇవ్వగానే హడలిపోతున్నారంటూ సెటైర్లు వేశారు. విచారణకు వెళ్తానని చెబుతూనే బడాయి కబుర్లు చెబుతున్నారంటూ మండిపడ్డారు. కేటీఆర్ సత్యహరిశ్చంద్రుడి మాదిరిలా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు ఆది శ్రీనివాస్.
నార్కో.. నాకా నీకా?
సీఎం రేవంత్ రెడ్డికి నార్కో ఎనాలసిస్ టెస్ట్ చేయాలా.. లేదంటే పాలిగ్రాఫ్ టెస్టులు చేయాలా అన్నది కోర్టులు, విచారణ సంస్థలు నిర్ణయిస్తాయన్నారు. కేటీఆర్ మాత్రం ఏసీబీ విచారణకు హాజరై వాళ్లు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెపితే సరిపోతుందన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి ధైర్యం ఉంటే కేసీఆర్, కవిత, హరీష్‌రావు నార్కో టెస్టులు చేయించుకోవాలని సవాల్ విసిరారు శ్రీనివాస్. “కాళేశ్వరంలో మీ కక్కుర్తి పైన మీ అయ్యకు, మీ బావకు నార్కో ఎనాలసిస్ టెస్ట్ చేయిందాం.. లిక్కర్ స్కాంలో మీ చెల్లెలుకి నార్కో చేయిద్దాం.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నీకు కూడా టెస్ట్ చేయాలి” అంటూ ప్రభుత్వ విప్ ఆది ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. కేటీఆర్‌కు జైలుకు వెళ్లాలన్న ఉబలాటం అంతగా ఉంటే ఆ కోరికను దర్యాప్తు సంస్థలు తీర్చుతాయని.. తొందర పడకండంటూ సెటైర్లు వేశారు.
ఇంగ్లీష్ ఫుల్.. సబ్జెక్ట్ నిల్..
కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ట్విటర్ టిల్లు కేటీఆర్‌కు ఇంగ్లీష్ ఫుల్, సబ్జెక్ట్ నిల్ అన్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో నోటీసులు ఇవ్వడంతో ఆ ప్రస్టేషన్‌తో లై డిటెక్టర్ టెస్ట్ చేయించుకుందామని సీఎం రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నారని చెప్పారు. ఆ నాడు డ్రగ్స్ కేసులో వైట్ ఛాలెంజ్ నుంచి ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. కేబినెట్ అనుమతి లేకుండా 44కోట్లు ఎలా తరలించారని ఏసీబీ ప్రశ్నించడం, ఏజెన్సీలు విచారణ చేయడం తప్పా అని ప్రశ్నించారు. మొన్న కేసీఆర్ చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయన్న కవిత.. ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్‌కు నోటీసులు ఇస్తారని అనడం విడ్డూరంగా ఉందన్నారు. వీళ్ల ఫ్యామిలీ డ్రామాని ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు చామల.
కేటీఆర్ ఫ్రస్టేషన్ అందుకేనా?
ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కూడా కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. విచారణకు హాజరై సమాధానం చెప్పమంటే.. పక్కవారి కేసులను లింకు పెడుతూ పక్క చూపులు ఎందుకు చూస్తున్నారంటూ నిలదీశారు. లై డిటెక్టర్ పేరుతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తప్పుబట్టారు. ముందు చెల్లె చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని.. ఇంటి లొల్లితో ప్రస్టేషన్‌లో కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కేటీఆర్‌పై పోలీస్ కేసు
మరోవైపు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చేసిన ఫిర్యాదుపై యాక్షన్ తీసుకున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు అవమానకరంగా, సీఎం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని వెంకట్ ఇచ్చిన కంప్లైంట్‌పై కేసు ఫైల్ అయింది.
#BRS ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అవకతవల ఆరోపణలపై విచారణకు రావాలంటే కేసీఆర్ కుటుంబానికి భయమెందుకో…. తప్పు చేయనప్పుడు ఉలిక్కి పాటు ఎందుకు..?
రాబందుల్లా పదేళ్లు తెలంగాణను దోచుకుతిన్న దోపిడి దొంగల కుటుంబం మీది.
మీరు దోచుకున్నది దాచుకున్నది, బయటపెట్టేందుకే ప్రతీ విషయంలో… pic.twitter.com/kVg3pJSjOE
— Dr.Venkat Balmoor (@VenkatBalmoor) June 13, 2025
When you cannot run a government, keep people busy with a circus and distractions! Congress and its clown CM’s antics won’t deter us
I have been summoned by the Anti-Corruption Bureau to appear for ‘investigation’ on Monday at 10am, in Formula-E case where ₹ 44 crore was…
— KTR (@KTRBRS) June 13, 2025