HBD Sreeleela: యంగ్ బ్యూటీ శ్రీలీల (Sree Leela) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కన్నడ పరిశ్రమకు చెందిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో హీరో శ్రీకాంత్ (Srikanth ) తనయుడు హీరోగా వచ్చిన ‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే పర్వాలేదు అనిపించుకున్న ఈమె.. ఆ తర్వాత రవితేజ (Raviteja ) హీరోగా నటించిన ‘ధమాకా’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. ఈ సినిమా అందించిన విజయంతో వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. అలా ఏకంగా ఒకే ఏడాది తొమ్మిదికి పైగా చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరోయిన్ గా రికార్డు సృష్టించింది శ్రీ లీల.
సక్సెస్ కోసం శ్రీ లీల ఆరాటం..
ఇకపోతే వరుస పెట్టి అవకాశాలైతే అందుకుంది. కానీ ఆ సినిమాలతో సక్సెస్ అందుకోలేక చతికిల పడింది ఈ ముద్దుగుమ్మ. పైగా ఈమె సైన్ చేసిన కొన్ని సినిమాల నుండి ఈమెను తప్పించారు కూడా.. దాంతో ఉన్న అవకాశాలు కూడా చేజారడంతో అడపాదడపా సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు పూర్తిస్థాయిలో సక్సెస్ అందివ్వలేదు. ఇప్పుడు మరొకసారి రవితేజతో జతకట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యింది. అందులో భాగంగానే రవితేజ హీరోగా.. భాను భోగవరపు (Bhanu Bhogavarapu) దర్శకత్వంలో వస్తున్న ‘మాస్ జాతర’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి సందర్భంగా థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. మరొకవైపు హిందీలో కూడా కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan) తో కలిసి సినిమా కూడా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నట్లు సమాచారం.
Also read: Manchu Vishnu – Deepika: సందీప్ – దీపిక ఇష్యూ పై విష్ణు రియాక్షన్.. అలా చేయడం తప్పే అంటూ!
శ్రీ లీల ఫేవరెట్ ఫుడ్..
ఇదిలా ఉండగా ఈరోజు శ్రీ లీలా పుట్టినరోజు కావడంతో ఈమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే శ్రీ లీల కి ఇష్టమైన ఆహారం ఏంటి? అనే విషయాన్ని తెలుసుకోవడానికి అభిమానులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. మరి శ్రీ లీల ఫేవరెట్ ఫుడ్ ఏంటో ఈరోజు ఆమె బర్త్డే సందర్భంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.తాజాగా శ్రీ లీల పుట్టినరోజు కావడంతో ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ అవ్వగా.. అందులో ఒకటి ఈ ఫేవరెట్ ఫుడ్. గతంలో ఆమె టీం చెప్పిన వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారింది. శ్రీ లీలకి పల్లీల కారంపొడిని అన్నంలో కలుపుకొని తినడం అంటే చాలా ఇష్టమట. అంతేకాదు పల్లీపొడి, కారం అంటే ఇంకా ఇష్టమని, ఈ రెండింటిని కలిపి మరి తింటానని చెబుతున్న ఒక వీడియోని శ్రీలీల టీం గతంలో సోషల్ మీడియాలో షేర్ చేసింది. రోజూ ఇది ఒక్కటి ఉంటే చాలు తినేస్తాను అంటూ శ్రీ లీల తెలిపింది. అంతేకాదు కారాన్ని ఇంగ్లీషులో ఏమంటారండీ అంటూ ఎంతో క్యూట్ గా అడిగిన వీడియో ఇప్పుడు నెట్టింట చెక్కర్లు కొడుతోంది. మొత్తానికైతే ఈ వీడియో వైరల్ కావడంతో శ్రీలీలా అమాయకత్వాన్ని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతే ఫన్నీగా కామెంట్స్ కూడా పెడుతున్నారు.