Gaddar Film Awards: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నేడు తెలంగాణలో జరగబోతున్న గద్దర్ అవార్డుల (Gaddar Awards)వేడుకకు దూరంగా ఉంటున్నారు. సినీ నటీనటుల ప్రతిభను గుర్తిస్తూ ఎన్నో పురస్కారాలను అందిస్తుంటారు. అయితే దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఎంతో అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ అవార్డుల వేడుక నేడు సాయంత్రం హైటెక్ సిటీలో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయ్యాయి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేయబోతున్నారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ పనుల నిమిత్తం ముస్సోలినిలో ఉన్నారు. ఇలా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలోనే గద్దర్ అవార్డు వేడుకలకు హాజరు కాలేకపోతున్నారని సమాచారం.
నంది అవార్డులు కాస్త గద్దర్ అవార్డులు..
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి ఈ అవార్డుల వేడుక జరగబోతోంది. అయితే ప్రత్యేక తెలంగాణ ఏర్పడకు ముందు నంది అవార్డులతో నటీనటులను గౌరవించేవారు కానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి ఈ అవార్డులను ప్రకటించారు. అయితే నంది అవార్డుకు బదులుగా గద్దర్ పేరు మీద ఈ అవార్డులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ అవార్డు వేడుకలలో పాల్గొనడం కోసం ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సెలబ్రిటీలకు ఆహ్వానం అందింది. ఇక మెగాస్టార్ చిరంజీవికి కూడా ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది.
అవార్డు వేడుకకు చిరు దూరం…
ఈ గద్దర్ అవార్డు వేడుకలలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ,నాగార్జున వంటి స్టార్ హీరోలు అందరూ కూడా ఒకే వేదికపై కనిపిస్తారని అభిమానులు ఆశపడ్డారు కానీ చిరంజీవి మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అనిల్ రావిపూడి(Anil Ravipudi) సినిమా షూటింగ్ నిమిత్తం చిరంజీవి చిత్ర బృందంతో కలిసి డెహ్రాడూన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరు ముస్సోలిని లో జరుగుతున్న షూటింగ్ లో బిజీ గా వున్నారు.టైట్ షెడ్యూల్, కాంబినేషన్ షూట్ వల్ల ఈ పోగ్రామ్ కి హాజరు కాలేకపోతున్నా అని నిర్వాహకులకు చిరంజీవి సమాచారం అందించినట్టు తెలుస్తుంది.
ఇక ఈ గద్దర్ అవార్డు వేడుకలలో భాగంగా 10 సంవత్సరాల నుంచి ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి అవార్డులను ప్రకటించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ అవార్డులను అందుకోబోతున్న సెలబ్రిటీలు హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇక నేడు సాయంత్రం హైటెక్ సిటీలో జరగబోయే ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ పాల్గొనబోతున్నారని తెలుస్తుంది.ఇలా ఎంతోమంది సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక నేడు కన్నుల పండుగగా జరగనుంది.ఇక ఈ వేడుకకు చిరంజీవి హాజరు కావడం లేదని వార్త తెలియడంతో అభిమానులు కూడా కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.