BigTV English

MLA Yennam Srinivas Reddy: విగ్రహం టచ్ చేసి చూడు.. మీ పనైపోయిందంటూ యెన్నం ఫైర్

MLA Yennam Srinivas Reddy: విగ్రహం టచ్ చేసి చూడు.. మీ పనైపోయిందంటూ యెన్నం ఫైర్

MLA Yennam Srinivas Reddy: తెలంగాణ తల్లి విగ్రహంపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి. మీరు అధికారంలోకి వస్తామని కళలు కంటున్నారని, మీ పనైపోయింది బిడ్డా తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.


రాజకీయం కోసం బీఆర్ఎస్ దిగజారి మాట్లాడుతోందని ఆరోపించారు యెన్నం శ్రీనివాస్ రెడ్డి. ముఖ్యంగా కవిత, కేటీఆర్ మరింత దిగజారి మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. చట్టసభల ద్వారా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, విగ్రహం టచ్ చేసి చూడండంటూ కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుకు ఛాలెంట్ విసిరారు.

తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పుడు తెలంగాణ ప్రజల సొంతమన్నారు. తెలంగాణ తల్లి ఆవిష్కరణ జరిగి ప్రజలు సంతోషంగా ఉన్నారని, తెలంగాణ తల్లికి మట్టి గాజులే ఉంటాయి, ఆభరణాలు ఉండవన్నారు. కవిత మాటలు మరోలా ఉన్నాయన్నారు. అందుకే తెలంగాణ తల్లిలో బీదరికం కనిపిస్తోందన్నారు.


కేసీఆర్ ఆనాడు ఏర్పాటు చేసిన విగ్రహం కేవలం శ్రామికవర్గానికి సంబంధం లేకుండా ఉందంటూ అభ్యంతరాలు వచ్చాయన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కేసీఆర్ అధికారికంగా జీవోలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

ALSO READ: తెలంగాణ తల్లి రూపాన్ని వక్రీకరిస్తే నేరమే.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

బీఆర్ఎస్ పదేళ్లలో అసెంబ్లీ అంటే ఫామ్‌హౌజ్, సెక్రటేరియేట్ అంటే ప్రగతి భవన్‌గా భావించిందన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ‌భవన్ తరలిస్తామని నేతలు చెప్పడంపై మండిపడ్డారు యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×