Ram Gopal Varma : వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) ఇటీవల కాలంలో వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో భారీ ఊరట లభించింది. ఇప్పటిదాకా వర్మపై నమోదైన మూడు కేసుల్లో ఆయనకి ముందస్తు మెయిల్ లో మంజూరు చేసింది కోర్టు.
అసలు వివాదం ఏంటంటే… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేశాడంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. వర్మ సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్, లోకేష్‌పై అసభ్యకర పోస్టులు చేశాదంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆర్జీవిపై కేసు నమోదయింది. ఇక ఇది మాత్రమే కాకుండా సినిమా పోస్టర్లపై అనకాపల్లి, తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో రాంగోపాల్ వర్మ మీద వరుసగా రెండు కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలోనే ఆర్జీవి (Ram Gopal Varma) అరెస్టుకు రంగం సిద్ధమైందని వార్తలు వినిపించాయి. కానీ ఆయన పరారీలో ఉన్నాడని పుకార్లు షికార్లు చేశాయి. కాస్త హైడ్రామా జరిగాక, రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా తాను పరారీలో ఉన్నాను అంటూ వార్తలు రావడంపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలేం జరిగింది అనే విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా బయట పెట్టారు. అప్పుడెప్పుడో చేసిన పోస్ట్ పై ఇప్పుడు ఎందుకు ఇంత హంగామా? కేవలం సోషల్ మీడియాలో సెటైర్లు వేసినందుకే అరెస్ట్ చేయాలి అంటే… ఈ దేశంలో సగం మందికి పైగా జైల్లోనే ఉంటారు. అంతేకాకుండా “నేను వాళ్ళ గురించే పోస్ట్ చేశాను అనడానికి సాక్ష్యం ఏంటి ?” అంటూ లాజిక్స్ లాగారు.
ఇక మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)కు ఇప్పటికే పోలీసులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. అయితే ఏపీ హైకోర్టులో మాత్రం ముందస్తు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. తాజాగా ఈ కేసులో రాంగోపాల్ వర్మ కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. ముందస్తు బెయిల్ గురించి ఆర్జీవి దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత, ఆర్జీవి ముందస్తు మెయిల్ పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో, ఈ మూడు కేసుల్లోనూ రాంగోపాల్ వర్మకి భారీ ఊరట లభించినట్టుగా అయింది. అయితే కేవలం బెయిల్ మంజూరు చేయడం మాత్రమే కాదు హైకోర్టు రాంగోపాల్ వర్మకు షరతులు కూడా విధించింది. దర్యాప్తుకు రాంగోపాల్ వర్మ సహకరించాలని, పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది కోర్టు.