BigTV English

Telangana Talli Statue: తెలంగాణ తల్లి రూపాన్ని వక్రీకరిస్తే నేరమే.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Telangana Talli Statue: తెలంగాణ తల్లి రూపాన్ని వక్రీకరిస్తే నేరమే.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

⦿ రూపాన్ని వక్రీకరిస్తే నేరమే
⦿ అవమానించడం, మరో కోణంలో చూపడంపై నిషేధం
⦿ తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రభుత్వ ఆమోదం
⦿ ప్రతి ఏడాది డిసెంబర్ 9న అవతరణ ఉత్సవం
⦿ రాష్ట్రవ్యాప్తంగా అధికారిక కార్యక్రమాలు
⦿ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతి కుమారి


హైదరాబాద్, స్వేచ్ఛ: Telangana Talli Statue: తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ బహుజనుల పోరాట పటిమను, సాంస్కృతిక, సాంప్రదాయ, వ్యవసాయ పద్ధతులను, శ్రమించే జీవనశైలిని, భావితరాలకు స్ఫూర్తిని కలిగించే ఒక చిహ్నంగా ‘తెలంగాణ తల్లి’ ఉండాలని భావించి ఆమోదించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఆమోదించిన రోజైన డిసెంబర్ 9 తేదీన ప్రతి ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ‘తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం’గా నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తగిన విధంగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని వెల్లడించింది.

కుడి చేతితో అభయం.. ఎడమ చేతిలో పంటలు
తెలంగాణ తల్లి సాంప్రదాయ స్త్రీమూర్తిగా ప్రశాంత వదనంతో, బంగారు అంచు కలిగిన ఆకుపచ్చని చీరలో, సాంప్రదాయ కట్టుబొట్టుతో, మెడకు కంఠ, గుండు పూసల హారం, చేతికి గాజులు, కాళ్లకు కడియాలు, మెట్టెలు, చెవులకు బుట్టకమ్మలు, ముక్కుపుడకతో మధ్యవయస్సు స్త్రీమూర్తిలా హుందాగా, ఎంతో స్ఫూర్తిదాయకంగా రూపొందించినట్టు ప్రభుత్వం వివరించింది. కుడిచేతితో అభయాన్ని, ఎడమచేతిలో సాంప్రదాయ పంటలైన వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న పంటలు ప్రాంతీయ వ్యవసాయ సంస్కృతికి చిహ్నంగా చూపించినట్టు వెల్లడించింది.


Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు.. ప్రభాకర్‌ పై హరీష్ రావు ఒత్తిడి.. అఫిడవిట్‌లో సంచలన నిజాలు

వక్రీకరిస్తే నేరమే
‘తెలంగాణ తల్లి’ విగ్రహం జాతి అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీక అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ తల్లి చిత్రాన్ని, రూపాన్ని వక్రీకరించడం, మరో కోణంలో చూపించడాన్ని నిషేధిస్తున్నట్టు తెలిపింది. తెలంగాణ తల్లి చిత్ర రూపురేఖలను బహిరంగ ప్రదేశాలలో గానీ, ఇతర ప్రదేశాలలో గానీ, లేదా ఆన్‌లైన్‌లో, సామాజిక మాధ్యమాలలో మాటలు లేక చేతలతో అగౌరవపరిచినా, ధ్వంసం చేసినా, కాల్చడం, అవహేళన చేయడం, కించపరచడం వంటి చర్యలను నేరంగా పరిగణించనున్నట్టు ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×