Big Stories

Dharmana on AP land titling act: ఏపీలో రాజకీయాలు.. ఆ చట్టం చుట్టూనే!

Dharmana on AP land titling act: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్నకొద్దీ అధికార వైసీపీ-విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం ముదిరిపాకాన పడింది. ముఖ్యంగా జగన్ సర్కార్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ పదేపదే ప్రస్తావిస్తున్నారు. దీనిపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

- Advertisement -

తాజాగా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై విపక్ష నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని మిగతా రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నాయో, ఏపీలోనూ అదే విధంగా చేస్తామన్నారు. న్యాయస్థానాల నుంచి క్లియరెన్స్ వచ్చాకే దీన్ని అమలు చేస్తామన్నారు. ఈ మేరకు మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న చుక్కల భూములకు తమ ప్రభుత్వం పరిష్కారం చూపిందన్నారు మంత్రి ధర్మాన. రియల్ ఎస్టేట్ కోసం అమరావతిని రాజధాని అని టీడీపీ ప్రచారం చేసిందని దుయ్యబట్టారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందన్న ఆయన, అసత్య ప్రచారాలతో లబ్ది పొందేందుకు ప్లాన్ చేసిందన్నారు. వందేళ్ల కిందట రాష్ట్రంలో భూసర్వే జరిగిందని, ఇప్పటివరకు ఏ ప్రభుత్వం సర్వే చేపట్టలేదన్నారు. ఈ క్రమంలో భూసంస్కరణలకు వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.

మొత్తం 17వేల రెవెన్యూ గ్రామాలుండగా, అందులో నాలుగువేల గ్రామాల్లో సర్వే పూర్తి అయ్యిందన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. సర్వే తర్వాత ల్యాండ్ రికార్డులను అప్‌డేట్ చేస్తామన్నారు. ప్రతీ రెవెన్యూ గ్రామంలో ఆఫీసులను ఏర్పాటు చేసి కంప్యూటరీకరణ చేస్తామని, కొత్తగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరిగితే డాక్యుమెంట్ ఆధారంగా ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ అవుతుందన్నారు. ఇంతకీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఏంటి?

ALSO READ:  ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీం సీరియస్.. జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ

జగన్ సర్కార్ రెండేళ్ల కిందట ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చింది. ఆస్తి సర్వే చేసి ఎవరి పేరు మీద నమోదు చేస్తారో వారితో చెందుతుంది. భూములు, ఇళ్లు, పొలం వాటిపై వివాదాలుంటే వీఆర్వో నుంచి సివిల్ కోర్టుల వరకు ఎవరు జోక్యం చేసుకునే వీలు లేదు. వీటికి సంబంధించిన వివాదాలను పరిష్కరించే బాధ్యత టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసుదే. ఏదైనా సమస్య ఉంటే దీనికి సంబంధించి అప్పిలేట్ ఆఫీసు దగ్గరకు వెళ్లాలి. అక్కడ న్యాయం జరగలేదని భావిస్తే నేరుగా హైకోర్టును ఆశ్రయించవచ్చన్నమాట.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News