Malakpet Marijuana: కూరగాయల వ్యాపారం మాటున గంజాయి దందా చేస్తున్న సంఘటన పోలీసులకు షాక్‌కి గురిచేసింది. ఇక వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని మలక్‌పేట ప్రాతంలో గంజాయి అమ్మే నిందితుడు అరుణ్ ఖరార్ ఇంట్లో ఎక్సైజ్ పోలీసుల మెరుపు దాడులు చేసారు. ఈ దాడుల్లో ఇంట్లో కనిపించిన నోట్ల కట్టలు చూసి అధికారులే షాక్ తిన్నారు. రూ.500 నోట్లతో రూ.10 వేల చొప్పున 76 కట్టలు అధికారులు స్వాదీనం చేసుకున్నారు.
ఒక్కొక్కటిగా పేర్చిన నోట్ల కట్టలపై పోలీసుల ప్రశ్నలకు నోరు మెదపకుండా నిందితుడు అలాగే ఉండిపోయాడు. గంజాయి వ్యాపారం డబ్బులా.. హవాలా సొమ్మా..? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. రూ.7.59 లక్షల నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంట్లో 450 గ్రాముల గంజాయి.. నగదు కట్టలు ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేయింగ్ మెషిన్, గంజాయి ప్యాకింగ్ కవర్లు కూడా అధికారుల సీజ్ చేశారు.
రెండేళ్ల క్రితం హౌరా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన అరుణ్ కారర్.. ఘన్సీ బజార్‌లో కూరగాయల వ్యాపారం తెరవెనుక గంజాయి విక్రయాలు చేస్తునట్టు పోలీసులు గుర్తించారు. తెలిసిన కస్టమర్లకే గంజాయి సరఫరా చేస్తున్నట్లు గర్తించారు. నోట్ల కట్టల వెనుక నెట్‌వర్క్‌పై ఎక్సైజ్ పోలీసుల ఆరా తీస్తున్నారు. అరుణ్ కస్టమర్లు ఎవరు..? డబ్బుల మూలాలపై ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేసి గంజాయి దందాతో పాటు హవాలా కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Also read: గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలుకు బ్రేకులు పడకపోతే.. ఎలా ఆపుతారో తెలుసా?