US Tech Outages: ఉదయం లేచి ఆఫీస్ మెయిల్ ఓపెన్ చేస్తే పనిచేయడం లేదు.. బయటకు వెళ్లి విమానం ఎక్కుదామంటే ఫ్లైట్స్ ఎయిర్‌పోర్ట్‌లకే పరిమితమయ్యాయి.. అత్యవసరంగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేద్దామంటే బ్యాంకింగ్ సర్వీసులు పనిచేయడం లేదు. ఇదేదో సినిమా కథ కాదు. అగ్రరాజ్యం అమెరికాలో కేవలం ఐదు రోజుల గ్యాప్‌లో జరిగిన వరుస ఇన్సిడెంట్స్ ఇవన్నీ. మైక్రోసాఫ్ట్ అవుటేజ్‌తో మొదలైన ఈ టెక్నికల్ సమస్యలు.. ఏవియేషన్ రంగాన్ని దెబ్బతీసి.. చివరికి అమెరికాలోని అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థలను కూడా ఇబ్బందులు పెడుతున్నాయి. అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? ఇవన్నీ అనుకోకుండా జరుగుతున్న ఘటనలేనా? లేక దీని వెనుక ఏదైనా సైబర్ అటాక్ ఉందా?
బ్యాంక్‌ల విషయానికి వద్దాం..
ముందుగా బ్యాంక్‌ల విషయానికి వద్దాం జనవంబర్ 16, సోమవారం.. అమెరికాలోని ప్రముఖ బ్యాంకుల కస్టమర్లకు ఇబ్బందులు మొదలయ్యాయి. JPMorgan Chase, Bank of America, US Bank, Wells Fargo ఇలా అనేక బ్యాంకుల ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ సర్వీసుల్లో టెక్నికల్ ఇష్యూస్ స్టార్టయ్యాయి. కొందరు కస్టమర్లు తమ అకౌంట్లలోకి లాగిన్ కాలేకపోతే.. మరికొందరు బ్యాలెన్స్ చెక్ చేయలేకపోయారు. ఇంకొందరికి మనీ ట్రాన్స్‌ఫర్స్, వైర్ ట్రాన్స్‌ఫర్స్ కూడా నిలిచిపోయాయి. అంతేకాదు.. జెల్లె, క్యాపిటల్ వన్ సేవల్లోనూ సమస్యలు వచ్చినట్లు కంప్లెంట్స్ వచ్చాయి. డౌన్ డిటెక్టర్ డేటా ప్రకారం.. మధ్యాహ్నం రెండు గంటల టైమ్‌లో ఈ అవుటేజ్ కంప్లెంట్స్ పీక్స్‌కు చేరాయి. ఒక్క Chase బ్యాంక్ విషయంలోనే దాదాపు 4 వేల 800 మంది ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు రిపోర్ట్ చేశారు.
JPMorgan Chase రియాక్ట్
ఈ ఇష్యూపై JPMorgan Chase రియాక్ట్ అయ్యాయి. తమ ఆన్ ప్రెమైజ్ హార్డ్‌వేర్ సిస్టమ్స్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ బగ్ కారణంగా ఈ ఇబ్బంది వచ్చిందని తెలిపింది. ఇది సైబర్ అటాక్ కాదని అనౌన్స్ చేసింది.
యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో కూడా టెక్నికల్ ఇష్యూ
ఓ వైపు ఇలా బ్యాంకింగ్ సెక్టార్‌లో టెక్నికల్ ఇష్యూస్ జరుగుతున్న టైమ్‌లోనే.. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో కూడా టెక్నికల్ ఇష్యూ వచ్చింది. 90 నిమిషాలకు పైగా కొనసాగిన ఈ సిస్టమ్ అవుటేజ్ కారణంగా విమానాల టేకాఫ్‌లు ఆలస్యమయ్యాయి. విమానం బయల్దేరే టైమ్‌లో ఎంత బరువు ఉందనే ఫైనల్ వెయిట్ అండ్ బ్యాలెన్స్ డేటా పైలట్లకు అందలేదు. ఈ దెబ్బతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన దాదాపు 600 విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఆ తర్వాత సమస్యను సాల్వ్ చేశారు.
అమెరికా ఏవియేషన్‌లో భారీ టెక్నికల్ ఇష్యూ
కానీ ఇక్కడితో కథ ముగియలేదు. దీనికి కేవలం మూడు రోజుల ముందే.. అంటే నవంబర్ 13న అమెరికా ఏవియేషన్‌లో భారీ టెక్నికల్ ఇష్యూ వచ్చింది. FAA టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో సమస్య కారణంగా అమెరికా వ్యాప్తంగా విమానాల టేకాఫ్‌లపై గ్రౌండ్ స్టాప్ విధించాల్సి వచ్చింది. దీని ఇంపాక్ట్‌తో మూడు రోజుల్లో 18 వేలకు పైగా విమానాలు ఇంపాక్ట్ అయ్యాయి. 9/11 దాడుల తర్వాత అమెరికా ఎదుర్కొన్న అత్యంత సుదీర్ఘమైన గ్రౌండ్ స్టాప్‌లలో ఇదొకటిగా నిలిచింది.
12న మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో టెక్నికల్ ఇష్యూ
ఇక ఈ వరుస అవుటేజ్‌లకు ఆరంభం ఎక్కడో తెలుసా? మైక్రోసాఫ్ట్ దగ్గర. నవంబర్ 12న మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో టెక్నికల్ ఇష్యూ వచ్చింది. Outlook, Teams, Copilot వంటి కీలక సేవలు పనిచేయకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయాయి. దాదాపు 24 గంటల పాటు కొనసాగిన ఈ సమస్యపై మైక్రోసాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ చేయగా.. కొన్ని కారణాలు బయటపడ్డాయి. కొంతకాలంగా ఉన్న సాఫ్ట్‌వేర్ బగ్.. అంతర్గత కనెక్షన్లలో సమస్యలు.. సర్వర్ సామర్థ్యానికి సంబంధించిన ఇబ్బందులు. ఈ మూడు అంశాలు కలిసిపోవడంతో సమస్య మరింత తీవ్రమైంది.
ఈ ఘటనల వెనుక ఏదైనా కుట్ర ఉందా..?
మరి ఈ మూడు ఘటనల వెనుక ఏదైనా కుట్ర ఉందా? లేక సైబర్ అటాక్ జరిగిందా? ఇదే ఇప్పుడు అతి పెద్ద డౌట్. కొంతమంది అమెరికన్లు ఈ వరుస అవుటేజ్‌లను చూస్తుంటే ఏదో పెద్ద ప్రమాదం పొంచి ఉన్నట్లు అనిపిస్తోందని టెన్షన్ పడుతున్నారు. అయితే సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్ మాత్రం ప్రస్తుతానికి అలాంటిదేమి లేదంటున్నారు.
ఈ ఘటనలు కారణం అదేనా..?
అయితే ఈ వరుస ఘటనలకు కారణం ఓల్డ్ టెక్నాలజీ అంటున్నారు మరికొందరు. అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కీలక మౌలిక సదుపాయాలు చాలా వరకు పాత టెక్నాలజీపైనే నడుస్తున్నాయంటున్నారు. నేటి టెక్నాలజీ సిస్టమ్స్ అన్ని కూడా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. ఇలాంటి సిచ్యూవేషన్స్‌లో ఒక చిన్న టెక్నికల్ సమస్య కూడా క్షణాల్లో పెద్ద సమస్యగా మారి, అనేక సర్వీస్‌లపై ఇంపాక్ట్ చూపించగలదు. అంటే.. ఒకచోట తలెత్తిన చిన్న సమస్య, దాని ఎఫెక్ట్‌తో మరో వ్యవస్థను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంది.
ఈ ఎపిసోడ్‌లో అసలైన ట్విస్ట్ ఏంటంటే..
ఈ మొత్తం ఎపిసోడ్‌లో అసలైన ట్విస్ట్ ఏంటంటే.. టెక్నాలజీలో ఎప్పుడూ ముందుండే అమెరికా లాంటి దేశమే.. ఇంకా పాత టెక్నాలజీపై డిపెండ్ అయి ఉండటం. బ్యాంకింగ్ నుంచి ఏవియేషన్ వరకు.. కమ్యూనికేషన్ నుంచి ఆఫీస్ కార్యకలాపాల వరకు.. ప్రతిదీ డిజిటల్ వ్యవస్థలపైనే డిపెండ్ అయిన ఈ రోజుల్లో.. ఒక చిన్న బగ్ కూడా దేశవ్యాప్తంగా ప్రభావం చూపించగలదు. అయితే ఇదంతా సైబర్ అటాక్ అయి ఉండొచ్చు అనే డౌట్స్ కూడా ఉన్నాయి.
దీని బట్టి మనం నేర్చుకోవాల్సింది..
కానీ ఈ ఘటనలన్నీ కూడా ఒకటి మాత్రం చెబుతున్నాయి. మనం టెక్నాలజీపై చాలా డిపెండ్ అయి ఉన్నాం. ఎందుకంటే.. ఒకప్పుడు బ్యాంకు మూతపడితేనే ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆగిపోయేవి. కానీ ఇప్పుడు అలా లేదు. కానీ ఒక సర్వర్ ఆగిపోతే మాత్రం.. ఆఫీస్ సర్వీస్‌లు ఆగిపోతాయి.. విమానాలు ఆగిపోతాయి.. బ్యాంకింగ్ నిలిచిపోతుంది.. ఓవరాల్‌గా ప్రపంచమే స్తంభించిపోతుంది. అందుకే టెక్నాలజీ ఎంత వేగంగా డెవలప్ అవుతుందన్నది కాదు.. అది ఫెయిల్ అయినప్పుడు మన వ్యవస్థలు ఎంతవరకు తట్టుకోగలవన్నదే అసలైన ప్రశ్న.
Also Read: పనిపాటా లేకే కేటీఆర్ చిట్‌చాట్‌ల పేరుతో అబద్ధాలు చెబుతున్నారు: ఆది శ్రీనివాస్