E-Paper
Advertisement

గద్వాల్‌లో నిద్రిస్తున్న నిఘాలు.. పట్టించుకోని అధికారులు

గద్వాల్‌లో నిద్రిస్తున్న నిఘాలు.. పట్టించుకోని అధికారులు
Advertisement

Ketedoddi CCTV: స్వేచ్చ బ్యూరో: నేరాల నియంత్రణకు పోలీసు యంత్రాగం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఉన్నా ఉపయోగం లేకుండా పోతున్నాయి. నేరాల నియంత్రణకు దోహద పడే సీసీ కెమెరాల నిర్వహణలో అధికారులు అలసత్వం చేయడంతో నేరాల ఛేదనలో అవాంతరాలు ఏర్పాడుతున్నాయి. గత కొంతకాలంగా జోగుళాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చాలా వరకు సీసీ కెమెరాలు పనిచేయక అలంకార ప్రాయంగా మారాయి కేటిదొడ్డి మండలంలో‌ పలు గ్రామాల్లో ఎనిమిదేండ్ల క్రితం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పాడైపోవడంతో దిష్టిబొమ్మల్లగా మారినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని కేటిదొడ్డి మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాల మరమ్మతులు కరువై లక్షల రూపాయల విలువైన పరికరాలు వృథాగా మారుతున్నాయని, దీంతో నిర్వహణ భారంగా మారడంతో వాటిని అలాగే వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించి వినియోగంలో కి తీసుకురావాలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు.

నిఘా లేక చోరీలు..

‘ఒక్క సీసీ కెమెరా.. వంద మంది పోలీసులకు సమానం’ అని, తరచూ పోలీస్ అధికారులు చెబుతుంటారు. వాస్తవానికి దొంగతనాలు, దాడులు, ఇతర నేరాలేమైనా జరిగినప్పుడు నిందితుల గుర్తింపులో అవే కీలకం. అయితే కేటిదొడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస చోరీ ఘటనలు చోటు చేసుకుంటుండడం తో పోలీసుల నిఘా వ్యవస్థ పై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. నేరాల నియంత్రణకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు పై ప్రశ్నలు తలేత్తుతున్నాయి. కేటిదొడ్డి మండలంలో‌ మొత్తం 54 కెమెరాలు పోలీసులు , ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు. కానీ వాటి మేంటెనెన్స్ చేయలేక కేవలం కొన్ని సీసీ కెమెరాలు మాత్రమే పని చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా కేటిదొడ్డి మండలం ఇర్కిచేడు, పాగుంట, వెంకటాపురం, పాతపాలెం, కుచినెర్ల, చింతలకుంట, నందిన్నె గ్రామాలలో సీసి కెమెరాలు ఏర్పాటు చేశారు. మేంటెనెన్స్ చేయకపోవడంతో ఆందోళన కలిగిస్తోంది.

చెక్‌పోస్టులోనూ చీకటే!

Advertisement

తెలంగాణ–కర్ణాటక అంతర్రాష్ట్ర సరిహద్దులోని నందిన్నె చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సైతం కొంతకాలంగా పనిచేయడం లేదు. అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే కీలక ప్రాంతంలోనే నిఘా నేత్రాలు మూగబోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనుమానిత వాహనాలు, వ్యక్తుల కదలికలను గుర్తించడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు.

పనిచేసేవి తక్కువ..

తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో కేటిదొడ్డి మండలాని నూతన మండలంగా ఏర్పాటు చేశారు. దీంతో కేటిదొడ్డి మండలంలో మొత్తం 23 గ్రామ పంచాయతీలు ఉండగా 54 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిలో కొన్ని మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలిన కెమెరాలు పనిచేయడం లేదు. ఇంత పెద్ద సంఖ్యలో కెమెరాలు పని చేయక పోవడానికి కారణమేంటి ? వాటి నిర్వహణ పై అధికారుల పర్యవేక్షణ ఏదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

నేరాల నియంత్రణలో జాప్యం..

Advertisement

గత కొంతకాలంగా సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో పని చేయకపోవడంతో నేరాల నియంత్రణలో జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా దొంగతనాలు, వాహనాల దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అందుకు బాధ్యులను వెంటనే గుర్తించేందుకు పోలీసులు ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి. ఇక కొన్ని కెమెరాలు పనిచేస్తున్న అవి నాసిరకంగా ఉండడంతో వర్షం పడ్డా లేదా చీకటిగా ఉన్న అవి రికార్డు చేసిన పుటేజీలు స్పష్టంగా కనిపించడంలేదు. వీటి నిర్వహణ బాధ్యత, మరమ్మతులు భారాన్ని ఎవరు భరించాలో తెలియక సీసీ కెమెరాలు అలంకార ప్రాయంగా మారాయి. గత కొంత కాలంగా సీసీ కెమెరాలు పనిచేయడంలేదు. ఉన్నతాధికారులతో మాట్లాడి పని చేయని కెమెరాలను గుర్తించి మరమ్మతులు చేయించి ఉపయోగంలోకి తెస్తామని సబ్ ఇన్‌స్పెక్టర్‌‌- కేటిదొడ్డి శ్రీనివాసులు అన్నారు.

Also read: పనిపాటా లేకే కేటీఆర్ చిట్‌చాట్‌ల పేరుతో అబద్ధాలు చెబుతున్నారు: ఆది శ్రీనివాస్

Tags

Related News

మారనున్న మల్కన్‌గిరి-భద్రాచలం రైల్వే లైన్.. కొత్తగా ఈ రూట్లో వచ్చే చాన్స్?

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు షాకింగ్ న్యూస్..?

మందు బాబులకు గుండె పగిలే వార్త.. చీప్ లిక్కర్‌తో ఖరీదైన బ్రాండ్లు తయారీ!

ముద్రా రుణాల పేరుతో భారీ సైబర్ మోసం

పనిపాటా లేకే కేటీఆర్ చిట్‌చాట్‌ల పేరుతో అబద్ధాలు చెబుతున్నారు: ఆది శ్రీనివాస్

తెలంగాణ పోలీసులకు భారీ గుడ్ న్యూస్.. త్వరలో ప్రమోషన్లు!

ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఆవిర్భావ వేడుకల్లో.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కీలక వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×