MP KiranKumar Reddy: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోస్తున్నారు. కేటీఆర్ ఎక్స్ వేదికగా చేసిన కామెంట్స్‌పై మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్‌రెడ్డి. ఒక్కసారి గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఎవరు ఏంటో తెలుస్తుందన్నారు.
కేటీఆర్ కామెంట్స్‌పై ఎంపీ కిరణ్‌కుమార్ రెడ్డి ఆగ్రహం
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ పార్టీలు వేర్వేరు స్ట్రాటజీని అవలంభిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తోంది. బీజేపీ రోడ్డు షోలు చేస్తుండగా.. ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇంటింటికి ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో నేతల మధ్య మాటలు తూటాల మాదిరిగా పేలుతున్నాయి.
బుధవారం సాయంత్రం బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి.. బీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు పలు ప్రశ్నలు సంధించారు.
చిల్లర మాటలొద్దు.. గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకే తెలుస్తోందంటూ కౌంటర్
కేటీఆర్‌ని ట్విట్టర్ టిల్లుగా వర్ణించారు ఎంపీ కిరణ్‌కుమార్. ఎక్స్ వేదికగా ఆయన చిల్లర మాటలు రాస్తున్నారని, ఆ పదాలకు రాజులు మీరేనని గట్టిగా కౌంటరిచ్చారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఆ పదాల గురించి గూగుల్‌లో కొడితే కేసీఆర్ పేరు ముందుగా వస్తుందన్నారు. గతంలో మీ నాన్న ఎలాంటి భాష మాట్లాడారో ఒక్కసారి యూట్యూబ్‌లో చూడాలంటూ కేటీఆర్‌కు కౌంటరిచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భాష మనుషులను బట్టి ఉంటుందన్నారు. మీ గురించి మాట్లాడాలంటే మీ భాషలో మాట్లాడితే అర్ధం అవుతుందని భావించిన ముఖ్యమంత్రి ప్రజలకు అర్ధం అయ్యే విధంగా చెప్పారన్నారు. రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో, అప్పుల పాలు చేశారో ప్రజలకు అర్థమైందని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని పక్కన బెట్టారన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మీకు గుండు సున్నా ఇచ్చారని గుర్తు చేశారు సదరు ఎంపీ. ఇక కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీకు ప్రజలు బుద్ది చెప్పారని, పంచాయతీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారని తెలిపారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి రెండేళ్లుగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టె ప్రయత్నం చేస్తున్నారని వివరించారు.
ALSO READ: గ్రూప్-1 మెయిన్స్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఊపిరి పీల్చుకున్న వేలాది మంది అభ్యర్థులు
కేసీఆర్ కుటుంబం ఇంటికో ఉద్యోగం అని చెప్పి తమ ఇంట్లో ఐదుగురికి ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. ట్విట్టర్ టిల్లు పోస్టులు పెట్టినంత మాత్రాన ఒరిగేది, తరిగేది ఏమీ ఉండదన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్న ఎంపీ కిరణ్, రానున్న వారం రోజుల్లో గల్లీలో బీఆర్ఎస్ దొంగల ముఠా మాట్లాడే చిల్లర మాటలను ప్రజలు పట్టించుకోవద్దన్నారు.
మాపై నమ్మకంతో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తారని, ఐదేళ్ల తర్వాత ప్రజలే న్యాయ నిర్ణేతలని తెలియజేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని పట్టణ, నగర ప్రజలను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు.
కేటీఆర్ కి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్
బూతులకు నాయకుడు ఎవరు అని గూగుల్ లో కొడితే కేటీఆర్ తండ్రి కేసీఆర్ పేరే వస్తుంది
సీఎం రేవంత్ రెడ్డి భాష మనుషులను బట్టి ఉంటుంది
గతంలో కేసీఆర్ వాడిన భాష యూట్యూబ్ లో చూసుకోండి
వాళ్ల గురించి అర్థం కావాలంటే ప్రజలకు వాళ్ల భాషలోనే… pic.twitter.com/8y7M8onHVt
— BIG TV Breaking News (@bigtvtelugu) February 5, 2026