E-Paper
Advertisement

Sandeep Reddy Vanga: యానిమల్ పార్క్.. రిలీజ్ డేట్ తో పాటు స్టోరీ కూడా చెప్పేసిన డైరెక్టర్!

Sandeep Reddy Vanga: యానిమల్ పార్క్.. రిలీజ్ డేట్ తో పాటు స్టోరీ కూడా చెప్పేసిన డైరెక్టర్!
Advertisement

Sandeep Reddy Vanga:ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ డైరెక్టర్గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy vanga). ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలో సత్తా చాటిన ఈయన.. ఆ తర్వాత హిందీలో ‘కబీర్ సింగ్’ సినిమా చేసి తన ఖాతాలో వేసుకున్నారు. గత మూడేళ్ల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor)తో ‘యానిమల్’ సినిమా చేసి సంచలనం సృష్టించారు సందీప్ రెడ్డివంగా. ఇందులో రష్మిక మందన్న (Rashmika mandanna)హీరోయిన్గా నటించగా.. త్రిప్తి డిమ్రి (Tripti dimri)కీలకపాత్ర పోషించి.. ఈ ఒక్క సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది.

యానిమల్ పార్క్ కి సర్వం సిద్ధం..

ఇకపోతే ఈ సినిమా అప్పట్లో భారీ విజయం అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని దానికి ‘యానిమల్ పార్క్’ అంటూ మేకర్స్ టైటిల్ ని కూడా ప్రకటించారు.. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది? అసలు షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది? అని అభిమానులు వేయికళ్లతో ఎదురు చూడగా.. గత కొన్ని రోజుల క్రితం రణ్ బీర్ కపూర్ ఈ సినిమాపై ఊహించని అప్డేట్ ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది అని క్లారిటీ ఇచ్చి సీక్వెల్ ఉంటుందని స్పష్టం చేశారు.

జపాన్ లో విడుదల కానున్న యానిమల్..

Advertisement

అయితే ఇలాంటి సినిమాపై క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా ఊహించని కామెంట్లు చేయడంతో అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. ఈ సినిమా రిలీజ్ ఆరోజే.. స్టోరీ ఇదే అంటూ చేసిన కామెంట్లకు మరింత ఎగ్జైట్ అవుతున్నారని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి 13వ తేదీన ‘యానిమల్’ సినిమా జపాన్లో విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే రణ్ బీర్ కపూర్ , సందీప్ రెడ్డి ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.. ప్రమోషన్స్ లో భాగంగా అక్కడి అభిమానులతో సందడి చేసిన వీరు.. అందులో భాగంగానే పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

యానిమల్ పార్క్ రిలీజ్ డేట్ తో పాటూ స్టోరీ కూడా లీక్..

ఈ సందర్భంగా జపాన్ అభిమానులతో సందీప్ రెడ్డివంగా మాట్లాడుతూ..” యానిమల్ పార్క్ ఉంటుంది
2027 జూన్ లేదా జూలైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. ఒకే పోలికలతో ఉండే ఇద్దరు సోదరుల మధ్య జరిగే భీకర పోరునే ఈ సినిమాలో చూపించబోతున్నాము.రణబీర్ కపూర్ పోషించిన రణవిజయ్, అజీజ్ పాత్రల ఘర్షనే కథాంశం” అంటూ ఆయన అటు ఈ సినిమా కథాంశంపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక 2028లో విడుదల చేస్తామని, ఇందులో హీరోగా, విలన్ గా రణ్ బీర్ నటించనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి అయితే సినిమా విడుదల తేదీతో పాటు స్టోరీ కూడా లీక్ చేసి అంచనాలు పెంచారు సందీప్ రెడ్డి వంగ.

Advertisement

ALSO READ:Pushpa 2: జపాన్ లో కూడా సత్తా చాటిన పుష్పరాజ్.. క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలివే!

సందీప్ రెడ్డి వంగ సినిమాలు..

ప్రస్తుతం ఈయన రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)తో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేస్తున్నట్లు ముందుగానే అధికారిక ప్రకటన వెల్లడించారు. ఏది ఏమైనా స్పిరిట్ సినిమాతో సంచలనాలు సృష్టించి యానిమల్ పార్క్ తో రికార్డు బ్రేక్ చేయాలని చూస్తున్నారు.. యానిమల్ తో సంచలనం సృష్టించిన రన్బీర్ యానిమల్ పార్క్ తో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×