BigTV English

Congress : టీకాంగ్రెస్ రైతు భరోసా యాత్ర.. షెడ్యూల్ రిలీజ్..

Congress : టీకాంగ్రెస్ రైతు భరోసా యాత్ర.. షెడ్యూల్ రిలీజ్..

Telangana congress news today(Latest political news telangana) : తెలంగాణలో కాంగ్రెస్ మరో కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది. రైతు భరోసా యాత్ర చేపట్టేందుకు టీపీసీసీ కిసాన్‌ సెల్‌ కార్యచరణ రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో యాత్ర సాగుతుంది. ఈనెల 19 ఆదిలాబాద్‌లో రైతు భరోసా యాత్ర ప్రారంభం కానుంది. ఆగస్టు 2న నిజామాబాద్‌లో యాత్ర ముగుస్తుంది.


రైతులు ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అజెండాగా రైతు భరోసా యాత్ర సాగనుంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయరంగ అభివృద్ధికి ఏం చేస్తామనే విషయంపై రైతులకు స్పష్టత ఇస్తామని టీపీసీసీ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు సుంకెట అన్వేశ్‌రెడ్డి తెలిపారు. టీపీసీసీ ఈ యాత్ర షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది.

ఈనెల 19న సాయంత్రం ఆదిలాబాద్‌లో రైతు భరోసా యాత్ర ప్రారంభమవుతుంది. ఈ నెల 20న ఆసిఫాబాద్, మంచిర్యాల, 21న జగిత్యాల, సిరిసిల్ల, 22న సిద్ధిపేట, జనగామ, 23న హనుమకొండ, వరంగల్, 24న పెద్దపల్లి, భూపాలపల్లి, 25న ములుగు, మహబూబాబాద్ లో యాత్ర సాగుతుంది.


ఈ 26న కొత్తగూడెం, ఖమ్మం, 27న సూర్యాపేట, యాదాద్రి, 28న రంగారెడ్డి, నాగర్‌ కర్నూల్, 29న వనపర్తి, గద్వాల, 30న మహబూబ్‌నగర్, నారాయణపేట, 31న వికారాబాద్, సంగారెడ్డి, ఆగస్టు 1న మెదక్, కామారెడ్డిల మీదుగా ఆగస్టు 2 నాటికి నిజామాబాద్‌ జిల్లాకు రైతు భరోసా యాత్ర చేరుకుంటుంది. అక్కడే యాత్రను ముగిస్తారు. ఆ రోజు నిజామాబాద్‌లో భారీ సభ నిర్వహించే యోచనలో ఉన్నారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×