BigTV English

NDA : ఢిల్లీలో ఎన్డీఏ కీలక సమావేశం.. పాత మిత్రులకు ఆహ్వానం..

NDA : ఢిల్లీలో ఎన్డీఏ కీలక సమావేశం.. పాత మిత్రులకు ఆహ్వానం..

NDA meeting in delhi today(BJP India latest news): ఢిల్లీ వేదికగా మంగళవారం ఎన్డీఏ కీలక భేటీ జరగబోతోంది. ప్రతిపక్షాల ఐక్యతా సమావేశానికి ధీటుగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. గతంలో దూరమైన మిత్ర పక్షాలను అక్కున చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఎన్డీఏ సమావేశానికి ఏర్పాట్లు చేసింది. ఈ భేటీకి 38 పార్టీలు హాజరవుతాయని బీజేపీ నేతలు తెలిపారు.


లోక్‌సభ ఎన్నికలకు ఇంకా 9 నెలలే సమయం ఉంది. ఒకవైపు 9 ఏళ్ల మోదీ పాలనలో అమలు చేసిన పథకాలు , చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమాలను బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టింది. మరోవైపు కొత్త పొత్తుల కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. కొత్త పార్టీలను ఎన్డీఏలోకి ఆహ్వానిస్తోంది. గతంలో ఎన్డీఏలో ఉండి తర్వాత బయటికి వెళ్లిన పార్టీలను తిరిగి కలుపుకునే చర్యలు చేపట్టింది.

ఎన్డీఏలో తిరిగి చేరుతున్నట్లు సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓపీ రాజ్‌భర్ తాజాగా ప్రకటించారు. 2019లో ఎన్డీఏ నుంచి ఆయన బయటకు వచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతంలో ఓబీసీ ఓటర్లపై రాజ్‌భర్‌కు పట్టు ఉంది. ఇక బిహార్‌లో లోక్‌ జనశక్తి పార్టీలో చీలిక తెచ్చిన చిరాగ్ పాశ్వాన్‌ను కూడా ఢిల్లీలో జరిగే ఎన్డీఏ సమావేశానికి జేపీ నడ్డా ఆహ్వానించారు. ఏపీ నుంచి జనసేనను ఆహ్వానించారు.


బిహార్ సీఎం నేతృత్వంలోని జేడీయూ, ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, అకాలీ దళ్ లాంటి పార్టీలు బీజేపీతో విభేదించి ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్నాయి. AIDMKను, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీలు, నాయకులను ఎన్​డీఏ సమావేశానికి జేపీ నడ్డా ఆహ్వానించారు. ప్రధానిగా మోదీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఎన్డీఏ భేటీ జరగనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. అటు బెంగళూరులో విపక్షాల సమావేశం రెండోరోజు జరగనుంది.

Related News

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

Big Stories

×