BigTV English

Madhu Yashki Meets Jeevan Reddy: జీవన్‌రెడ్డితో మధుయాష్కీ భేటీ, కూల్ అయినట్టేనా?

Madhu Yashki Meets Jeevan Reddy: జీవన్‌రెడ్డితో మధుయాష్కీ భేటీ, కూల్ అయినట్టేనా?

Madhu Yashki Meets Jeevan Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అలక వీడారు. హైకమాండ్‌కు లేఖతో నేతలు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం జగిత్యాల వెళ్లారు కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ.


నాలుగురోజుల కిందట ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యకు గురయ్యాడు. దీనిపై జీవన్ రెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. కాంగ్రెస్‌లో ఉన్నా, తన అనుచరులకు రక్షణ లేదని ఆరోపించారు. గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి తన ఆవేదనను బయటపెట్టారు.

వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరడంపై జీవన్ రెడ్డి కాసింత ఆగ్రహంగా ఉన్నారు. ఈ వ్యవహారంపై పార్టీ హైకమాండ్ కు లేఖ రాశారాయన. ఈ నేపథ్యంలో జీవన్‌రెడ్డితో కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ మంతనాలు సాగించారు.


హత్యకు గురైన గంగారెడ్డి కుటుంబాన్ని శనివారం ఉదయం పరామర్శించారు మధుయాష్కీ. తనకు తెలీకుండానే చేరికలను పార్టీ ప్రొత్సహించడాన్ని తప్పుబట్టారు జీవన్‌రెడ్డి.  మొత్తానికి నేతల మధ్య ఏయే అంశాలు చర్చలు వచ్చాయో తెలీదుగానీ, జీవన్‌రెడ్డి కాస్త కూల్ అయినట్టు కనిపిస్తోంది.

 

 

Related News

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Mallareddy: మల్లారెడ్డి యూటర్న్.. రాజకీయాల్లో నో రిటైర్మెంట్

Telangana rains: మళ్ళీ ముంచెత్తనున్న వర్షాలు.. ఆగస్టు 14 నుండి 17 వరకు జాగ్రత్త!

Big Stories

×