E-Paper
Advertisement

Congress : రేవంత్‌కు తలనొప్పిగా మారిన సీనియర్లు!

Congress : రేవంత్‌కు తలనొప్పిగా మారిన సీనియర్లు!
Advertisement

సీఎం రేవంత్ రెడ్డికి సీనియర్లు తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అలుగుతున్నట్టు తెలుస్తోంది.దీనికి తోడు మరికొందరు తనతో పాటే తన కుటుంబీకులకు సైతం పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.దీంతో ఆయన ఇటు ప్రభుత్వ పాలనపై సరిగా ఫోకస్ పెట్టలేకపోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల సమయంలో కొందరు సీనియర్లు తమకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని అలిగినట్టు తెలిసింది. ఫలితంగా ప్రచారంలో వారు వెనుకబడటం, అభ్యర్థులకు కేడర్ నుంచి మద్దతు లభించపోవడంతో కొన్ని చోట్ల కాంగ్రెస్ గెలిచే స్థానాలను పార్టీ కోల్పోవాల్సి వచ్చిందని సీఎం తెప్పించుకున్న నివేదికల్లో తేలింది.

సహాయ నిరాకరణ..

దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారంతా సీఎం రేవంత్ నాయకత్వాన్ని తొలుత అంగీకరించలేదు. తాము పార్టీలో సీనియర్లమని, తమ మాటే చెల్లాలని హైకమాండ్ లెవల్లో లాబీయింగ్ చేశారు.దీంతో సీనియర్లు అందరి ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. వారికి నచ్చజెప్పి గత అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేసేలా చేశారు. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి రాగానే సీనియర్లకు సముచిత స్థానం కల్పించారు.కొందరికి నామినేటెడ్, మరికొందరికి కేబినెట్ హోదాతో కూడిన పదవులు కట్టబెట్టారు.అయినప్పటికీ కొందరు తమకు మంత్రి పదవులు ఇవ్వలేదని ఇప్పటికీ సీఎం రేవంత్ మీద గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.అందులో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, మధుయాష్కీ వంటి వారున్నారు. ఇందులో షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డికి సీఎం రేవంత్ ప్రభుత్వ సలహాదారు పదవులు కట్టబెట్టారు.

రాజీనామా అస్త్రం..

Advertisement

ఇటీవల కాలంలో పార్టీలో తమకు సముచిత స్థానం కల్పించడం లేదని, వలస ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇస్తున్నారని మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తున్నదని, తనకు ఇవ్వడంలేదని ఆయన హర్ట్ అయ్యారు. ఇప్పటికు ఆయన్ను మంత్రులు బుజ్జగించినా ఆయన అలక వీడటం లేదు. ఈ క్రమంలోనే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చారు. రేపు అధికారికంగా పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. తన అనుచరులతో మాట్లాడకే భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఇదిలాఉండగా, ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.

Telangana Registrations: తెలంగాణలో రిజిస్ట్రేషన్లకు అంతరాయం.. సర్వర్లలో సాంకేతిక లోపం

Advertisement

మరికొందరు సీనియర్లు సైతం అటుపార్టీకి, ఇటు ప్రభుత్వానికి అడ్డు తగులుతున్నట్టు తెలుస్తోంది.ఎన్నికల్లో సహాయనిరాకరణ, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా ప్రత్యర్థి పార్టీలతో కలిసి రాజకీయాలు చేస్తున్నారని సీఎం రేవంత్‌కు నిఘా వర్గాలు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తున్నది. దీంతో వారి వ్యవహారం త్వరగా తేల్చాలని ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సీఎం రేవంత్ నిన్న ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి ఇస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. అందరికీ మంత్రి పదవులు సాధ్యం కాదు.సామాజిక వర్గాల కాలికులేషన్ సైతం చెక్ చేయాల్సి ఉంటుంది. అందుకే సీనియర్లను సీఎం బుజ్జగిస్తారా? లేక వారికి మంగళం పలుకుతారా? అనేది తెలియాల్సి ఉన్నది.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×