E-Paper
Advertisement

Dalit Empowerment: దళిత వాదంతోనే కాంగ్రెస్ ఆవిర్భావం: టీపీసీసీ మహేష్​ కుమార్ గౌడ్

Dalit Empowerment: దళిత వాదంతోనే కాంగ్రెస్ ఆవిర్భావం: టీపీసీసీ మహేష్​ కుమార్ గౌడ్
Advertisement

Dalit Empowerment: దళిత వాదంతోనే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగిందని టీపీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్ తెలిపారు. ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ.. దళితులకు, ఆదివాసీలకు, బీసీలకు సముచిత స్థానం కల్పించామన్నారు. బరువైన బాధ్యతను సీఎం సలహా మేరకు కవ్వంపల్లిపై ఉంచామన్నారు. పీసీసీ బలోపేతం కావాలనే ఉద్దేశ్యంతోనే పార్టీలో కీలకమైన పదవి కేటాయించామన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అండగా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని వివరించారు. రెడ్డికి సీఎం, బీసీకి పీసీసీ చీఫ్​,దళిత సామాజిక వర్గం నుంచి స్పీకర్, డిప్యూటీ సీఎం, మంత్రి పదవులు ఇచ్చామన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.

కేసీఆర్ ఎలా తొలగించారో..

ఇక 90 ఏళ్ల తర్వాత కుల సర్వే చేసి అఫిషియల్ డాక్యుమెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. క్లిష్ట సమయాల్లో దళితులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారన్నారు. 17 శాతం ఉన్న ఎస్సీలకు 5 ముఖ్యమైన స్థానాలు ఇచ్చామన్నారు. రాబోయే పదవుల పంపకాల్లో ఎస్సీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. రాజయ్యను అర్ధరాత్రి డిప్యూటీ సీఎం పదవి నుంచి కేసీఆర్ ఎలా తొలగించారో ప్రజలంతా మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని టీపీసీసీ చీఫ్​ వివరించారు. ఇక సభ్యత్వ కార్యక్రమంలో రోజుకు 100 మంది చేరేలా కృషి చేయాలన్నారు. 100 సీట్లతో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్నదన్నారు. బీఆర్ ఎస్ నాలుగు ముక్కలు కాగా, తెలంగాణలో బీజేపీకి చోటు లేదన్నారు. రాబోయే రోజుల్లో ఎస్సీ తరపున కవ్వంపల్లి సూచించిన వారికే ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు కేటాయిస్తామన్నారు.

Advertisement

Also Read: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తాపడిన ట్రావెల్ బస్సు .. స్పాట్‌లో 22 మంది ప్రయాణికులు

దేశ ఐక్యతకు పాటు పడేది..

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… కవ్వం పల్లి సత్యనారాయణ సారథ్యంలో ఎస్సీల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. ఎస్సీ,ఎస్టీల అభ్యున్నతికి ముఖ్యం విద్య మాత్రమేనని వివరించారు. కాంగ్రెస్ పార్టీ నెహ్రు నుండి రాహుల్ గాంధీ వరకు సామాజిక న్యాయం చేస్తున్నదన్నారు. దేశ ఐక్యతకు పాటు పడేది కేవలం కాంగ్రెస్ మాత్రమేనని చెప్పారు. మాను కొండూరు ఎమ్మెల్యే, ఎస్సీ విభాగం చైర్మన్ కవ్వం పల్లి సత్యనారాయణ మాట్లాడుతూ. సీఎం రేవంత్ రెడ్డి లేకుంటే తాను ఎమ్మెల్యేగా ఊహించుకోవడం కష్టమేనని చెప్పారు. డాక్టర్ సాబ్ అంటూ తనకు టిక్కెట్ ఇచ్చారని వివరించారు. రేవంత్ రెడ్డి చలువతోనే తనకు ఎస్సీ విభాగం చైర్మన్ పదవి వరించిందన్నారు. 19 మంది ఎమ్మెల్యేలు ఉంటే నలుగురికి రేవంత్ రెడ్డి మంత్రి పదవులు ఇచ్చారన్నారు. సమాజం పట్ల సామాజిక బాధ్యత, సృహ ఉన్నదని సీఎం తనకు టిక్కెట్ కేటాయించారన్నారు. 59 కులాలకు చెందిన ఎస్సీ లను ఏకతాటిపైకి తీసుకురాగలనని సీఎం రేవంత్ రెడ్డి తనకు ఈ బాధ్యతలు ఇచ్చారన్నారు.

హామీలు నెరవేర్చే బాధ్యత..

Advertisement

పదవుల్లో దళితులకు 18శాతం ఇవ్వాలని కోరుకున్నారు. బ్యాక్ లాగ్ పోస్ట్ లు భర్తీ చేసేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గా నలుగు రు ఎమ్మెల్యేలు గెలవడానికి ప్రయత్నం చేశానని వెల్లడించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ.. అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రి పదవి రావడానికి నాదే ఘనత అంటూ గుర్తు చేశారు. మాదిగ ఎమ్మెల్యేలను ఢిల్లీ తీసుకపోయి సోనియా గాంధీ ని ఒప్పించి అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రి పదవి ఇప్పించానని చెప్పారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ.. వర్గీకరణ కావడమే రేవంత్ రెడ్డి చేసుకున్న పుణ్యమన్నారు. మాల మాదిగ ఉప కులాల కలిసి ఉన్నంత కాలం రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అని చెప్పారు. చీలిక వస్తేనే సమస్య వస్తుందన్నారు. మంత్రి వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత ఎస్సీ విభాగం నుంచి కవ్వంపల్లికి ఉన్నదన్నారు. అన్నింటిలో ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్ పెంచాలన్నారు.

Also Read: Tourism Vigilance: తెలంగాణ టూరిజంలో విజిలెన్స్ వీక్.. దొరికిందే చాన్స్ అంటూ..!

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×