E-Paper
Advertisement

సిద్ధిపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ కన్ను.. సీటు కొట్టేందుకు గాంధీభవన్‌లో వేసిన బిగ్ ప్లాన్ ఇదే..?

సిద్ధిపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ కన్ను.. సీటు కొట్టేందుకు గాంధీభవన్‌లో వేసిన బిగ్ ప్లాన్ ఇదే..?
Advertisement

Siddipet Elections: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాల్లో సిద్ధిపేట్ ఒకటి. దశాబ్దాలుగా ఒకే కుటుంబం, ఒకే పార్టీ కనుసన్నల్లో నడుస్తున్న సిద్ధిపేట్ కోటపై ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగరేయాలని అధికార పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. రాబోయే సిద్ధిపేట్ మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏలాగైనా సరే ఈసారి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుని, గులాబీ కోటను బద్దలు కొట్టాలని పక్కా ప్లాన్‌తో అడుగులు వేస్తోంది.ఈ మేరకు ​ఇటీవల హైదరాబాద్‌లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ‘గాంధీభవన్’ లో సిద్ధిపేట్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులతో అధిష్టానం అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు.​ముఖ్యంగా, సిద్ధిపేట్‌లో దశాబ్దాలుగా తిరుగులేని పట్టున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేతను రాజకీయంగా బలహీనపరచడమే (వీక్ చేయడమే) ఏకైక లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి స్వయంగా పార్టీ శ్రేణులకు సూచించినట్లు సమాచారం. ఆయనకున్న ప్రజాధారణను, క్యాడర్ బలాన్ని దెబ్బతీస్తేనే సిద్ధిపేట్‌లో కాంగ్రెస్ గెలుపు సులువవుతుందని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది.

కీలక నేతలకు బాధ్యతలు…

​సిద్ధిపేట్ మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం భారీ స్కెచ్ వేసింది. ఇక్కడి స్థానిక సమీకరణాలను మార్చగల సత్తా ఉన్న కీలక నేతలకు ఈ ఎన్నికల పూర్తి బాధ్యతలను అప్పగించింది. ఆర్థిక, అంగబలంతో పాటు వ్యూహాలు రచించడంలో దిట్ట అయిన మంత్రి వివేక్‌కు ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు.అంతేగాక దూకుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన మైనంపల్లిని రంగంలోకి దించడం ద్వారా బీఆర్ఎస్ క్యాడర్‌ను ఆకర్షించడంతో పాటు, స్థానికంగా పార్టీకి కొత్త జోష్ తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ​ నేతలంతా కలిసి సిద్ధిపేట్ మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డుపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. బీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలను కాంగ్రెస్ లోకి లాగడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడమే వీరి టార్గెట్.

Advertisement

Also read: కేంద్రం కొత్త కసరత్తు.. బ్యాంకు ఉద్యోగులకు పండగే, అంతా డిజిటల్ మయం

హోరాహోరీ పోరు తప్పదా?

​గత కొంతకాలంగా సిద్ధిపేట్‌లో వన్ సైడ్ పాలిటిక్స్ నడుస్తుండగా.. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండటం, వ్యూహాత్మకంగా భారీ నేతలను రంగంలోకి దించుతుండటంతో రాబోయే మున్సిపల్ సమరం రసవత్తరంగా మారనుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈ మున్సిపల్ ఎన్నికలు సిద్దిపేటకు సెమీఫైనల్గా మారినన్నాయి. దీంతోనే కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకున్నది. మరోవైపు సిద్దిపేట్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేస్తామంటూ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఓ బహిరంగ సభలో ఓపెన్ ఆఫర్ చేశారు .మరి కాంగ్రెస్ వేస్తున్న ఈ “టార్గెట్ సిద్ధిపేట్” స్కెచ్ ఎంతవరకు పారుతుందో, మాజీ మంత్రి తన కోటను కాపాడుకుంటారో లేదో చూడాలి.

Advertisement

Also read: Yoga Day Celebrities: యోగా డే స్పెషల్.. హీరోయిన్ల యోగ పోజులు..

Related News

మీనాక్షినటరాజన్ కేసులో బిగ్ ట్విస్ట్.. బీజేపీ ఎంపీలు, ఎన్నికల అధికారికి హైకోర్టు నోటీసులు జారీ..!

దౌల్తాబాద్‌లో షాకింగ్ ఘటన.. గడ్డి మందు పిచికారీతో 8 ఎకరాల వరి పంట ధ్వంసం!

ఇకపై పోలీస్, అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ అన్నింటికీ ఒకే నంబర్.. ఏంటో తెలుసా..!

తుమ్మిడిహెట్టికి ‘ఎత్తు’ పెంచుతాం.. మహారాష్ట్రను ఒప్పించండి.. జల్‌శక్తి మంత్రికి సీఎం రేవంత్ రిక్వెస్ట్!

అప్పుడు ఏపీకి మద్దతిచ్చి.. ఇప్పుడు మొసలి కన్నీరా.. కేసీఆర్ పై ఉత్తమ్ ఫైర్!

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మరికాసేపట్లో కుండపోత వర్షం!

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మరో రెండు భారీ ఫ్లైఓర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ సీపీగెట్ ఫలితాలు విడుదల

Big Stories

Advertisement
×