Hyderabad News: ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన సికింద్రాబాద్, మోండా మార్కెట్ లో చోటుచేసుకుంది. ఇటీవల మోండా డివిజన్ బండి మెట్, సెకండ్ బజారులో ఇటీవల ఆవుల చోరీ జరిగింది. కొంత మంది దొంగలు ఖరీదైన కారుల్లో వచ్చి ఆవులను కార్లలో వేసుకుని పారిపోయారు. ఆవులను హింసిస్తూ ఇన్నోవా, హెర్టిగా కారుల్లో తీసుకువెళ్లారు. రెండు చోట్ల ఇదే ఘటన చోసుకోవడంతో స్థానిక ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇందులో ముఠా ఆవులను ఎత్తుకు వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. సిటీలో పలు ప్రాంతాల్లో గోవులకు మత్తు మందు ఇచ్చి కార్లల్లో తరలిస్తున్నట్టు బయటపడింది. గతంలో ఇలాంటి సంఘటనలు మారేడుపల్లి, ఇప్పుడు మోండా మార్కెట్ పీఎస్ పరిధిలో కేసు నమోదైంది.
మరి కొద్ది సేపట్లో నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో నార్త్ జోన్ డీసీపీ పెరుమాళ పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
ఇన్నోవా కారులో వచ్చి ఆవులను అపహరిస్తున్న ముఠా
ఓ ముఠా ఇన్నోవా కారులో వచ్చి ఆవులను అపహరించిన ఘటన సికింద్రాబాద్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండిమెట్ ప్రాంతంలో ఆవుల దొడ్ల వద్దకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు.. వాటికి మత్తు ఇంజక్షన్… pic.twitter.com/1JwctxKHs8
— ChotaNews App (@ChotaNewsApp) August 2, 2025
సికింద్రాబాద్, మోండా మార్కెట్లో కనిపించే పశువులే టార్గెట్ గా ముఠా సంచరిస్తోంది.. ఈ ముఠా ఈ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకొని, ఆవులకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి వాటిని సులభంగా దొంగిలిస్తున్నారు. నిందితులు మొదట ఆవులను గుర్తించి, రాత్రి సమయంలో లేదా జనాలు తక్కువగా ఉన్న సమయంలో మత్తు ఇంజక్షన్లు ఇచ్చి దొంగలిస్తున్నారు. ఈ మత్తు వల్ల ఆవులు స్పృహ కోల్పోతున్నాయి. దీంతో ముఠా సింపుల్ గా వాటిని వాహనాల్లోకి తరలిస్తోంది.
ALSO READ: IBPS Notification: డిగ్రీ అర్హతతో 10,277 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ వెకెన్సీలు.. డోంట్ మిస్
దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దొంగతనాల గురించి సమాచారం అందిన తర్వాత పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, మార్కెట్‌లో గస్తీని పెంచారు. సీసీ కెమెరాలు, స్థానికుల సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించారు. శుక్రవారం రాత్రి సమయంలో ముఠా సభ్యులు ఆవులకు ఇంజక్షన్ ఇస్తున్న సమయంలో పోలీసులు వారిని పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి ఇంజక్షన్ సిరంజీలు, మత్తు ఔషధాలు, దొంగిలించిన ఆవులను స్వాధీనం చేసుకున్నారు.
ALSO READ: Viral Video: భావోద్వేగంతో సాగనంపిన జనం, కంటతడి పెట్టిన ఏనుగు!
విచారణలో, ఈ ముఠా గత కొన్ని నెలలుగా ఈ విధంగా దొంగతనాలకు పాల్పడుతూ, ఆవులను ఇతర రాష్ట్రాలకు తరలించి అమ్ముతున్నట్లు తేలింది. నిందితులు స్థానికంగా కాకుండా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులతో కలిసి ఈ నేరాలను చేసినట్లు వెల్లడైంది. ఈ ఘటన స్థానిక పశువుల వ్యాపారుల్లో భయాందోళనలను కలిగించింది. దీంతో పోలీసులు మార్కెట్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పోలీసులు ఇప్పుడు ఈ ముఠాకు సంబంధించిన ఇతర సభ్యులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.