Salman Khan: సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీతో పాటు వారి చుట్టూ ఉండే ఫ్యాషన్ డిజైనర్స్, బాడీగార్డ్స్, హెయిర్ స్టైలిస్ట్ వంటి వారికి కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇలా కొన్ని సందర్భాలలో వీరికి కూడా సినిమాలలో చిన్న చిన్న అవకాశాలను కల్పిస్తూ ఉంటారు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)తో పాటు ఆయన బాడీగార్డ్స్ కి కూడా అదే స్థాయిలో ఆదరణ ఉందని చెప్పాలి. ఇక సల్మాన్ ఖాన్ వద్ద గత కొంతకాలంగా ఆయన బాడీ గార్డ్ (body guard)గా పని చేస్తున్న వారిలో షెరా(shera) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొంతకాలంగా సల్మాన్ ఖాన్ కు రక్షణ కల్పిస్తూ ఉన్నటువంటి ఈయన గతంలో సల్మాన్ హీరోగా నటించిన బాడీగార్డ్ సినిమాలోని ఒక పాటలో కనిపించారు.
నటనతో అదరగొట్టిన షెరా…
తాజాగా షెరా నటుడిగా మరో ఛాన్స్ కొట్టేశారు. అయితే సినిమాలో కాదండోయ్ ఈయన ఒక యాడ్ (ad)లో నటించే ఛాన్స్ కొట్టేశారు. ఒక గ్రోసరీ యాప్ కి సంబంధించిన యాడ్ లో కనిపించి సందడి చేశారు. ఇక ఈ యాడ్ లో ఈయన తన నటనతో అదరగొట్టారని చెప్పాలి. త్వరలోనే రక్షాబంధన్ (Raksha Bandhan)రాబోతున్న నేపథ్యంలో అమ్మాయిలను వేధించే వారికి అండగా నేనున్నానంటూ ఈయన ఈ యాడ్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా రక్షాబంధన్ సందర్భంగా తన సోదరులకు రాఖీ పంపించాలని ఈ సందర్భంగా తెలియచేశారు.
రక్షాబంధన్ సందర్భంగా…
ఇక ఈ యాడ్ లో భాగంగా వర్షంలో ఆటో కోసం ఎదురు చూస్తున్న ఓ మహిళకు ఆటో ఆపకపోవడంతో ఈయన ఆమెకు ఒక అన్నయ్యలా ఉండి రక్షణ కల్పిస్తారు. అలాగే పాఠశాలలో ఒక అమ్మాయిని తన క్లాస్మేట్ నుంచి రక్షించడంతో తన చేతికి రాఖి కట్టి వెళ్తారు. ఇలా రక్షాబంధన్ సందర్భంగా ఈయన చేసిన ఈ యాడ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవడంతో ఈ వీడియో పై నెటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తూ.. చివరికి సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్ కూడా నటుడిగా మారిపోయాడు… తన నటనతో అదరగొట్టాడు.. ఏమన్నా యాక్టింగా భయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
?igsh=ZnB2dTF0M29nMng3
ఇక షెరా విషయానికి వస్తే..అసలు పేరు గుర్మీత్ సింగ్ జాలీ, 1995 నుండి సల్మాన్ ఖాన్ వద్ద బాడీగార్డ్ గా ఈయన పని చేస్తూ, సల్మాన్ ఖాన్ కు ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇక షెరా టైగర్ సెక్యూరిటీ (Tiger Security) అనే భద్రతా సంస్థను నడుపుతున్నాడు. ఇలా టైగర్ సెక్యూరిటీ అనే సంస్థ ద్వారా భారీ స్థాయిలో డబ్బు సంపాదిస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా టైగర్ సెక్యూరిటీ ద్వారా ఎంతోమంది ప్రముఖులకు భద్రతను కల్పిస్తూ ఉంటారు. ఇక సల్మాన్ ఖాన్ విషయానికి వస్తే ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. చివరిగా సల్మాన్ ఖాన్ సికిందర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ జోడిగా రష్మిక నటించారు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది.
Also Read: Fire Storm Song : థమన్ దొరికిపోయాడు.. ఓజీ సాంగ్ పక్కా కాపీ