BigTV English
Advertisement

Manchu Manoj: నా జీవితాన్ని అందంగా మార్చావ్.. థాంక్యూ: మౌనిక రెడ్డి ఎమోషనల్

Manchu Manoj: నా జీవితాన్ని అందంగా మార్చావ్.. థాంక్యూ: మౌనిక రెడ్డి ఎమోషనల్

Dhairav: ఈ రోజు మంచు మనోజ్ భార్య మౌనిక రెడ్డి ఎమోషనల్ అయ్యారు. తన కుమారుడు ధైరవ్ ఆరో పుట్టిన రోజు సందర్భంగా భావోద్వేగంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తన భర్త మనోజ్, కుమారుడు ధైరవ్ ప్రేమతో క్షణాలు పంచుకున్న కొన్ని ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లు పోస్టు చేశారు.


 


తన కుమారుడికి మౌనిక రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘నీ ఎనర్జీ, ప్రేమ, చిరునవ్వు నన్ను ప్రతి రోజూ మరింత బెటర్‌గా చేస్తున్నది’ అని మౌనిక రెడ్డి పేర్కొన్నారు.

తనను తల్లిగా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు అని చెప్పారు. నీ ప్రేమ, నా జీవితంలో నీ ఉనికితో నన్ను కాపాడుతున్నావు అని పొంగిపోయారు.

‘నీకు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నాను. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. తల్లిగా ఇదే నాకు మంచి రోజు. నువ్వు నా చీర్ లీడర్’ అని మౌనిక రెడ్డి తెలిపారు.

ఈ భూప్రపంచంపై నా జీవితాన్ని అందంగా చేసినందుకు ధైరవ్ నీకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు.

అలాగే.. మంచు మనోజ్ కూడా ధైరవ్‌తో కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాలో పోస్టు చేశారు.

సుపుత్రుడు ధైరవ్‌కు ఆరో పుట్టిన రోజు శుభాకాంక్షలు అని మంచు మనోజ్ విష్ చేశారు. ఇన్‌స్టాగ్రామల్‌లో ధైరవ్‌కు శుభాకాంక్షలు చెబుతూ ఆనందంలో తేలిపోయారు.

‘నువ్వు సరదాగా ఉన్నప్పుడు సమయం తెలియకుండానే గడిచిపోతుంది. నీతో గడిపిన ఈ ఆరు సంవత్సరాల సమయం నా జీవితంలో సంతోషమయమైనవి’ అని మనోజ్ పేర్కొన్నారు.

నీ బలం, దయాగుణం నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి అని వివరించారు.

‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీకు అండగా నేను ఉంటాను. ప్రేమ, సంతోషం, మధురమైన క్షణాలతో నీ భావి సంవత్సరాలు ఉంటాయని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు.

మంచు మనోజ్, భార్య మౌనిక రెడ్డి దంపతులకు ఇటీవలే పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈమె కంటే ముందే మౌనికకు ధైరవ్ జన్మించాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే మంచు మనోజ్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాట్ ది ఫిష్ అనే సినిమాలో ఆయన హీరోగా నటిస్తున్నారు. ఇక మరో సినిమాలో ఆయన నెగెటివ్ రోల్ పోషిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

Related News

Nisha Agarwal: వెకేషన్‌లో చిల్‌ అవుతున్న అక్కా చెల్లెల్లు.. కాజల్‌, నిషా అగర్వాల్‌ ఫోటోలు వైరల్‌

Rakul Preeth Singh : చూపులతో మత్తెక్కిస్తున్న రకుల్.. స్టిల్స్ మాములుగా లేవు..

Kriti kharbanda: నాభి అందాలతో గత్తరలేపుతున్న కృతికర్బంధ..

Sreeleela : స్టైలిష్ లుక్ లో శ్రీలీల.. చంపేస్తుంది మావా..

Janhvi Kapoor: సాంప్రదాయంలో కూడా గ్లామర్ తో కట్టిపడేస్తున్న నయా అతిలోకసుందరి!

Divi Vadthya: వెరైటీ డ్రెస్ లో బిగ్ బాస్ దివి గ్లామర్ మెరుపులు..

Tejeswi Madivada: ఒంటి మీద పైట నిల్వలేదా తేజు.. పోజులతో పిచ్చేస్తుంది మావా..

Kajal Aggarwal: భర్తతో మధురమైన క్షణాలు.. స్టైలిష్ లుక్ లో కాజల్!

Big Stories

×