E-Paper
Advertisement

CPI Narayana : దమ్ముంటే ఓయూకి వెళ్లి ఓట్లు అడగు! కేసీఆర్‌కు నారాయణ సవాల్..

CPI Narayana : దమ్ముంటే ఓయూకి వెళ్లి ఓట్లు అడగు! కేసీఆర్‌కు నారాయణ సవాల్..
Advertisement
CPI Narayana comments on KCR

CPI Narayana comments on KCR(Political news in telangana) :

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ.. సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు . కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం చావు నోట్లో తల పెట్టాను అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఖమ్మం ఆస్పత్రిలో వైద్యం చేయించుకొని జ్యూస్ తాగిన తర్వాత.. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆగ్రహిస్తే మాట మార్చిన విషయం కేసీఆర్ మర్చిపోతే ఎలా అని విమర్శించారు.

కేసీఆర్ కు దమ్ముంటే తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ అయిన ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లి ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. కొత్తగూడెం లో వనమా కుమారుడి అరాచకాలు చూసి కూడా బీఆర్ఎస్ ను వెనుకేసుకు రావటం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు.

Advertisement

పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం సీటును సిపిఐకి కేటాయించిన విషయం తెలిసిందే. కొత్తగూడెంలో త్రిముఖ పోరు నడుస్తోంది. సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు, అధికార బీఆర్‌ఎస్ పార్టీ నుంచి వనమా వెంకటేశ్వర రావు, అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బీఆర్‌ఎస్ రెబెల్ జలగం వెంకట్ రావు బరిలో ఉన్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×