E-Paper
Advertisement

Rahul Gandhi : నాపై 24 కేసులున్నాయి, కేసీఆర్ మీద ఒక్క కేసు లేదు మీకు అర్థమవుతోందా: రాహుల్ గాంధీ

Rahul Gandhi : నాపై 24 కేసులున్నాయి, కేసీఆర్ మీద ఒక్క కేసు లేదు  మీకు అర్థమవుతోందా: రాహుల్ గాంధీ
Advertisement
Rahul Gandhi latest news

Rahul Gandhi latest news(Congress news telangana):

తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎంతో మంది యువకులు తమ రక్తాన్ని ధారబోసారు, ప్రాణాలు త్యాగం చేశారు. అలాంటి యువకుల వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఏ ఒక్కరి వల్లో కాదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

“నేను ఒకటే మాట చెబుతున్నాను.. బీఆర్ఎస్- బీజేపీ కలిసిపోయాయని చెప్పడానికి ఏకైక నిదర్శనం నేనే. ఎందుకంటే నాపై ప్రధాని మోదీ ఇప్పటివరకు 24 కేసులు పెట్టారు.  సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలను నాపైకి వదిలారు. అవి నిత్యం నాపై దాడి చేస్తూనే ఉన్నాయి.

Advertisement

నా ఇల్లు లాక్కున్నారు, కేసులు పెట్టి పార్లమెంట్ నుంచి వెళ్లగొట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్నీ పెట్టారు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు.. కొత్త కేసు ఒకటి నాపై పెడతారు. పోనీ మోదీ తను నిద్రపోయే సమయంలోనైనా నన్ను వదిలేస్తాడని అనుకుంటే.. తను కనే కలలో కూడా నన్ను వెంబడిస్తూనే ఉంటాడు.

మరి అన్ని కేసులు నాపై ఉన్నాయి. కానీ కేసీఆర్ మీద ఒక్కటి కూడా లేదు. అంటే దానర్థం వారిద్దరూ ఒకటేనని మీకు అర్థమవుతోందా? వీరికి ఎంఐఎం కూడా తోడైంది, వీరేం చెబితే అది తానా తందాన అంటుంది” అని రాహుల్ గాంధీ అన్నారు.

Advertisement

బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతూ కారు పంక్చర్ అయ్యిందని, నాలుగు టైర్లలో గాలి పోయిందని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రావడం తథ్యమని అన్నారు. ఇలా అధికారంలోకి రాగానే మొదటి ఫైల్ మీదే ఆరు ఉచిత పథకాలపై సంతకం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రం కోసం కలలు కన్న స్వప్నాన్ని కాంగ్రెస్ అధికరంలోకి రాగానే నెరవేరుస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో తిన్న డబ్బులని కక్కిస్తామని అన్నారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అవకతవకలన్నీ సరిదిద్దుతామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఓకే ఒక్క కుటుంబం ప్రజల సంపదను దోచుకుందని, అవెలా రప్పించాలో మాకు తెలుసునని అన్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×