BigTV English

Telangana : దానం దారెటు? కేసీఆర్ మీద అంత లవ్ ఎందుకు?

Telangana : దానం దారెటు? కేసీఆర్ మీద అంత లవ్ ఎందుకు?

Telangana : దానం నాగేందర్ దారెటు? కాంగ్రెస్‌లోనే ఉన్నారా? బీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారా? అనర్హత వేటుకు భయపడుతున్నారా? ఎంపీగా ఓటమి ఆయన్ను దెబ్బ దీసిందా? హస్తం పార్టీ పట్టించుకోవట్లేదని అలకా? రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ఆలోచనా? కారణం ఏదైనా ఆయన తీరు మాత్రం ఆసక్తికరంగా మారింది. దానం రాజకీయ ఉనికే ప్రశ్నార్థకంలో పడిందని అంటున్నారు.


కేసీఆర్ మీద సడెన్ లవ్?

లేటెస్ట్‌గా దానం నాగేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా జనం వస్తారని.. మీటింగ్ గ్రాండ్ సక్సెస్ అవుతుందని అన్నారు. కేసీఆర్‌ను చూడాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. అఫీషియల్‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న నాగేందర్ ఈ వ్యాఖ్యలు చేస్తే తప్పేమీ లేకపోవచ్చు. కానీ, కాంగ్రెస్ కండువా కప్పుకుని, హస్తం గుర్తుపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిన దానం ఇలా మాట్లాడటాన్ని ఎలా చూడాలి? కేసీఆర్, బీఆర్ఎస్‌కు సపోర్టుగా మాట్లాడి.. కాంగ్రెస్‌ను బ్లాక్‌మెయిల్ చేయాలని చూస్తున్నారా? గులాబీ బాస్‌కు దగ్గర అవ్వాలని ప్లాన్ చేస్తున్నారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.


సర్కారుకు యాంటీ వాయిస్?

కేసీఆర్ గురించే కాదు.. ఐఏఎస్‌ స్మితా సభర్వాల్, సీఎస్ శాంతికుమారిలపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. HCU భూములపై స్మితా సభర్వాల్ చేసిన రీట్వీట్‌లో తప్పేమీ లేదన్నారు దానం నాగేందర్. వాస్తవంగా ఉన్న విషయాన్నే ఆమె రీట్వీట్ చేశారని సమర్థించారు. కంచ గచ్చిబౌలి భూముల కేసులో చీఫ్ సెక్రటరీ శాంతికుమారిని జైలుకు పంపిస్తామంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. కెరీర్‌లో చిన్న మచ్చ కూడా లేని హానెస్ట్ ఆఫీసర్ అయిన శాంతికుమారికి తీవ్ర అవమానం కలిగిందంటూ చెప్పుకొచ్చారు. సెంట్రల్ యూనివర్సిటీని కాపాడాలని.. కంచ గచ్చిబౌలి భూముల డీఫారెస్టేషన్ ఆపాలని.. ప్రభుత్వం పునరాలోచన చేస్తోందని అన్నారు. దానం నాగేందర్ చేసిన ఈ కామెంట్స్ అన్నీ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవే. అందుకే దానం గురించి చర్చ..రచ్చ నడుస్తోంది.

హస్తంతో టచ్ మీ నాట్!

హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు లేకపోవడంతో దానం నాగేందర్ కారు దిగేసి.. హస్తం పార్టీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. చేతి గుర్తుపై సికింద్రాబాద్ పార్లమెంట్‌కు పోటీ చేసి కిషన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారు. అలాంటిదేమీ లేకపోవడంతో, కొంతకాలంగా దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఏఐసీసీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలకు వెళ్లటం లేదు. పీసీసీ చీఫ్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ నిర్వహించే సమీక్షా సమావేశాలకు సైతం దూరంగా ఉంటున్నారు. హైడ్రా పనితీరుపైనా బహిరంగంగానే ఘాటు విమర్శలు చేశారు. ఆ నోటి దురుసు వల్లే.. కాంగ్రెస్ పెద్దలు దానం నాగేందర్‌ను పెద్దగా పట్టించుకోవడం మానేశారని అంటారు.

దానం మళ్లీ కారెక్కేస్తారా?

ఇదే సమయంలో, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ గులాబీ నేతలు సుప్రీకోర్టుకు వెళ్లడంతో దానం పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఒక దశలో దానం తిరిగి బీఆర్ఎస్ గూటికి వెళ్తారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాలో వినిపించింది. అందుకు, తగ్గట్టే తాజాగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ అవుతుందంటూ, కేసీఆర్‌ను చూసేందుకు జనం వస్తారంటూ.. కాంగ్రెస్‌ను కవ్వించే కామెంట్స్ చేశారని భావిస్తున్నారు. కావాలనే HCU భూములు, స్మితా సభర్వాల్ రీట్వీట్, సీఎస్ శాంతికుమారి టాపిక్ గురించి ప్రస్తావించి.. సర్కారును ఇబ్బందుల్లో పడేయాలని చూస్తున్నారని అనుమానిస్తున్నారు. కానీ, గోడ మీద పిల్లిలా తరుచూ పార్టీలు మారే దానం నాగేందర్‌ను గులాబీ బాస్ మళ్లీ దగ్గరికి తీసుకుంటారా? అనేదే డౌట్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Related News

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు పడే ఛాన్స్..

Bathukamma: రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు

Karimnagar Fire Accident: కరీంనగర్‌లోని రీసైక్లింగ్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Telangana: ఎమ్మెల్సీ తాతా మధుపై ఖమ్మం జిల్లా నేతల తిరుగుబాటు!

Telangana Farmers: అక్టోబర్ తొలి వారంలోనే.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ!

TGPSC Group 2: టీజీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మరో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ ఇదే

Kalvakuntla Kavitha: కేసీఆర్ అడ్డాలో కవిత.. సీఎం , సీఎం అంటూ అరుపులు

Medaram Festival: మేడారం జాతరకు సీఎం రేవంత్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

Big Stories

×