BigTV English

WBPDCL Recruitment: టెన్త్, ఇంటర్ పాసైతే చాలు భయ్యా.. అప్లై చేసుకోవచ్చు.. జీతమైతే నెలకు రూ.94,000

WBPDCL Recruitment: టెన్త్, ఇంటర్ పాసైతే చాలు భయ్యా.. అప్లై చేసుకోవచ్చు.. జీతమైతే నెలకు రూ.94,000

WBPDCL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. టెన్త్ క్లాస్, ఇంటర్, డిగ్రీ, బీటెక్‌, బీఈ, ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ డిప్లొమా, డిప్లొమా, ఐటీఐ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అని చెప్పవచ్చు. వెస్ట్ బెంగాల్ పవర్ డెవపల్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (డబ్ల్యూబీపీడీసీఎల్) లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్లీరాదు. దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది.


మొత్తం వెకెన్సీల సంఖ్య: 114

విద్యార్హత: టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, ఎంబీఏ


అప్లికేషన్ లాస్ట్ డేట్: మే 26

జీతం: ఉద్యోగాన్ని బట్టి రూ.29,000 నుంచి 94,000 వరకు ఉంది.

వయస్సు: 63 దాటరాదు.

నోటిఫికేషన్ సమగ్ర సమాచారం..

వెస్ట్ బెంగాల్ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(WBPDCL)  లో కాంట్రాక్ట్ విధానంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి  అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. మే 26వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 114

వెస్ట్ బెంగాల్ పవర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో పలు రకాలు ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో జూనియర్ కన్సల్టెంట్, డిప్యూటీ కన్సల్టెంట్, ఏజెంట్ టీఈడబ్ల్యూబీ తదితర ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు:

 ఏజంట్ అండర్‌ టీఈడబ్ల్యూబీ: 01
జూనియర్ కన్సల్టెంట్: 03
డిప్యూటీ కన్సల్టెంట్‌: 01
సేఫ్టీ ఆఫీసర్‌: 01
బ్లాస్టింగ్ ఇన్‌ చార్జ్‌ అండర్‌ డీపీడీహెచ్‌: 01
అసిస్టెంట్ మైన్స్ సూపరింటెండెంట్‌ అండర్‌ డీపీడీహెచ్‌: 01
సూపర్‌వైసింగ్‌ ఆఫీసర్‌: 01
హెల్త్‌ ఆఫీసర్‌ అండర్‌ డీపీడీహెచ్‌: 01
సూపరింటెండెంట్‌(ఈ&ఎం) అండర్‌ డీపీడీహెచ్‌: 01
ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్‌ అండర్‌ డీపీడీహెచ్‌: 01
మ్యాగజైన్‌ ఇన్‌ఛార్జి: 04
సూపర్‌వైజర్‌: 12
సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌: 04
స్పెషల్‌ ఆఫీసర్‌: 05
అసోసియేట్: 73
అసిస్టెంట్ మ్యాగజైన్‌: 03
 ఇన్‌స్ట్రక్టర్‌: 01

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మే 5

దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 26

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్‌, బీఈ, ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ డిప్లొమా, డిప్లొమా, ఐటీఐ, ఇంటర్‌, టెన్త్ క్లాస్ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: 2025 ఏప్రిల్ 1 నాటికి 63 ఏళ్ల వయస్సు మించరాదు.

జీతం: ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. నెలకు ఇన్‌స్ట్రక్టర్‌, అసోసియేట్‌, స్పెషల్‌ ఆఫీసర్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, సూపర్‌వైజర్‌, మ్యాగజైన్‌ ఇన్‌ఛార్జ్‌, సూపరింటెండెంట్‌(ఈ&ఎం) అండర్‌ డీపీడీహెచ్‌, ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్‌ అండర్‌ డీపీడీహెచ్‌కు రూ.40,000 జీతం ఉంటుంది. సేఫ్టీ ఆఫీసర్‌, బ్లాస్టింగ్ ఇన్‌ చార్జ్‌ అండర్‌ డీపీడీహెచ్‌, అసిస్టెంట్ మైన్స్ సూపరింటెండెంట్‌ అండర్‌ డీపీడీహెచ్‌, సూపర్‌వైసింగ్‌ ఆఫీసర్‌, హెల్త్‌ ఆఫీసర్‌ అండర్‌ డీపీడీహెచ్‌కు రూ.63,000 జీతం ఉంటుంది. జూనియర్ కన్సల్టెంట్, డిప్యూటీ కన్సల్టెంట్‌కు రూ.75,000 జీతం ఉంటుంది. అసిస్టెంట్ మ్యాగజైన్‌కు రూ.29,000, ఏజంట్ అండ్ టీఈడబ్ల్యూబీకు రూ.94,000 జీతం ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా చేసుకోవాలి.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.wbpdcl.co.in

Also Read: Civil Ranker Story: మస్త్ గ్రేట్ కదా.. ఇంటర్‌ ఫెయిల్.. ఇప్పుడు సివిల్స్‌లో ర్యాంక్ కొట్టాడు..

Related News

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Union Bank of India: యూనియన్ బ్యాంక్‌‌లో ఉద్యోగాలు.. అక్షరాల రూ.93,960 జీతం.. క్వాలిఫికేషన్ ఇదే..

DSSSB Jobs: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 2119 ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇంకా 3 రోజులే..?

Big Stories

×