Sleeplessness: నిద్రలేమి సమస్యను ఇన్సోమ్నియా అని కూడా పిలుస్తారు. ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న అత్యంత సాధారణమైన సమస్యల్లో ఇది కూడా ఒకటి. ఇప్పటికే ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారిలో రాత్రిపూట నిద్రపోలేకపోవడం, తరచూ మేల్కొనడం లేదా ఉదయం అలసటగా ఫీల్ అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీన్ని తగ్గించడానికి ఏం చేయాలి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం..
నిద్రలేమి కారణాలు
నిద్రలేమి సమస్య రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఆందోళనలు వంటి వాటి వల్ల చాలా మందిలో ఒత్తిడి పెరిగిపోతుంది. దీని వల్ల రాత్రి టైంలో ఆలోచనలు ఆపడం కష్టమై నిద్ర దూరమవుతుందని మానసిక వైద్యులు చెబుతున్నారు.
మరికొందరిలో చెడు ఆహారపు అలవాట్ల వల్ల కూడా నిద్రలేమి వచ్చే అవకాశం ఉంటుందట. నిద్రపోయే సమయంలో భోజనం, ఎక్కువ కెఫీన్ తీసుకోవడం, రాత్రి వేళల్లో మొబైల్ లేదా టీవీ చూడడం వల్ల నిద్ర రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా పలు రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే శ్వాస సమస్యలు, మధుమేహం, నీరసం లేదా తల నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందట.
కొన్ని సార్లు మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా నిద్రలేమి సమస్యకు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డిప్రెషన్ లేదా ఆందోళనకు సంబంధించిన మెడిసిన్ వాడే వారిలో నిద్రలేమి వస్తుందట.
నిద్రలేమిని తగ్గించాలంటే?
నిద్రలేమిని అధిగమించడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు.
ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. ఫోన్, లాప్‌టాపు నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుందట. అందుకే నిద్రపోయే ముందు గంటసేపు మొబైల్ లేదా టీవీ చూడడం మానేయాలి.
ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా వంటివి అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా సాయంత్రం సమయంలో కెఫీన్ అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల నిద్రకు ఆటంకం కలగకుండా ఉంటుందట.
ALSO READ: వేసవిలో బార్లీ నీళ్లు తీసుకుంటే మాములుగా ఉండదు
నిద్రపోయే ముందు ఏదైనా పుస్తకం చదవడం అలవాటు చేసుకోవడం మంచిది. దీని వల్ల త్వరగా నిద్రలోకి జారుకోవడం సాధ్యం అవుతుంది. నిద్రలేమి సమస్య మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.