E-Paper
Advertisement

డిఫెన్స్ మద్యం బాటిళ్లతో.. దందా చేస్తున్న రెండు జంటలు!

డిఫెన్స్ మద్యం బాటిళ్లతో.. దందా చేస్తున్న రెండు జంటలు!
Advertisement

Defence Liquor: డిఫెన్స్​ మద్యాన్ని విక్రయిస్తున్న రెండు జంటలను ఎక్సయిజ్​ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2.11లక్షలకు పైగా విలువ చేసే 163 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. లోతుకుంట సరస్వతీనగర్ వాస్తవ్యులైన మన్యం నాగప్రసన్న, రామాంజనేయులు భార్యాభర్తలు. ఇదిలా ఉండగా రామాంజనేయులు డిఫెన్స్​ క్యాంటీన్ల నుంచి మద్యం బాటిళ్లు తెస్తుంటే నాగప్రసన్న వాటిని అమ్ముతోంది.

భార్యాభర్తలిద్దరిపై కేసులు..

ఈ మేరకు పక్కాగా సమాచారాన్ని సేకరించిన ఎక్సయిజ్​ పోలీసులు వారి ఇంటిపై దాడి జరిపారు. తనిఖీలు చేసి 96బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాగప్రసన్నను అరెస్ట్​ చేశారు. భార్యాభర్తలిద్దరిపై కేసులు నమోదు చేసి పరారీలో ఉన్న రామాంజనేయులు కోసం గాలిస్తున్నారు. న్యూ బోయిన్‌పల్లి సౌజన్య కాలనీలో ముసిమి లెంక (39) అనే మహిళ ఇంటిపై ఎక్సయిజ్​ స్టేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. తనిఖీలు చేయగా 67 డిఫెన్స్ మద్యం బాటిళ్లు దొరికాయి. దాంతో ఆమెను అరెస్ట్​ చేశారు. విచారణలో నిందితురాలి భర్త డిఫెన్స్​ క్యాంటీన్ల నుంచి మద్యం బాటిళ్లు తెస్తున్నట్టుగా వెల్లడైంది. ​

Advertisement

Also Read: పొలం మధ్యలో దర్జాగా గంజాయి సాగు కలకలం.. ఎక్కడంటే?

Tags

Related News

కరీంనగర్‌కు రానున్న నితిన్ నబీన్.. భారీ పాదయాత్రకు బిగ్ ప్లాన్!

కాంగ్రెస్ పాలనపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన మన్నె క్రిశాంక్!

హామీలు నెరవేర్చాలని పబ్లిక్ ఆస్తులు అమ్ముతారా.. ప్రభుత్వంపై నారాయణరెడ్డి ఫైర్!

పొలం మధ్యలో దర్జాగా గంజాయి సాగు కలకలం.. ఎక్కడంటే?

మేడ్చల్‌లో పౌరసరఫరాల శాఖ దాడులు.. 10 మందిపై క్రిమినల్ కేసులు నమోదు!

మీ ఇంట్లో పాత బట్టలు ఉన్నాయా.. మల్కాజిగిరి మున్సిపాలిటీ వినూత్న ప్రయోగం!

జీఓ నం. 14 ను రద్దు చేయాలని.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్!

Big Stories

Advertisement
×