E-Paper
Advertisement

మీ ఇంట్లో పాత బట్టలు ఉన్నాయా.. మల్కాజిగిరి మున్సిపాలిటీ వినూత్న ప్రయోగం!

మీ ఇంట్లో పాత బట్టలు ఉన్నాయా.. మల్కాజిగిరి మున్సిపాలిటీ వినూత్న ప్రయోగం!
Advertisement

Vastra Setu: మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తాజాగా మానవీయ కోణంలో సరి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, వస్త్ర వ్యర్థాల తగ్గింపు, సామాజిక బాధ్యతను ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన వస్త్ర సేతు కార్యక్రమాన్ని ఎంఎంసీ కమిషనర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి శనివారం తార్నాకలోని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇళ్లలో వినియోగించకుండా ఉన్న దుస్తులను సేకరించి, వాటిని అవసరమైన వారికి ఉపయోగపడేలా చేయడంతో పాటు, పునర్వినియోగం, పునరుత్పత్తి ద్వారా విలువైన వనరులుగా మార్చడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని కమిషనర్ తెలిపారు.

పర్యావరణ హితమైన..

ఉపయోగించని దుస్తులు చెత్తగా మారకుండా, మరొకరికి ఉపయోగపడేలా పౌరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా వస్త్ర వ్యర్థాలను తగ్గించడం, అవసరమైన వర్గాలకు సహాయం అందించడం, వనరులను సమర్థంగా వినియోగించడం, పర్యావరణ హితమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజల భాగస్వామ్యంతో వస్త్రాల పునర్వినియోగాన్ని ప్రోత్సహిస్తూ సర్క్యులర్ ఎకానమీ బలోపేతానికి ఈ చొరవ దోహదపడనుంది. మీరు ఉపయోగించని దుస్తులు మరొకరికి కొత్త ఆశగా మారవచ్చు అనే సందేశంతో ప్రారంభించిన వస్త్ర సేతు కార్యక్రమంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కమిషనర్ కోరారు.

కమిషనర్ సంచిత్ గంగ్వార్..

Advertisement

పాత వస్త్రాలను దానం చేయండి, పునర్వినియోగించండి, పునరుత్పత్తి చేయండి అంటూ కమిషనర్ పిలుపునిచ్చారు. సామూహిక భాగస్వామ్యంతో స్వచ్ఛమైన, పర్యావరణ హితమైన, సుస్థిర మల్కాజ్ గిరి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో మల్కాజ్ గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, అదనపు కమిషనర్ (హెల్త్,శానిటేషన్) రఘు ప్రసాద్ ఇతర ఎంఎంసీ అధికారులు, స్వచ్ఛ భారత్ మిషన్, బృందం సభ్యులు, గూంజ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read: మేడ్చల్‌లో మిషన్ భగీరథ నీరు రోడ్డుపాలు.. పట్టించుకోని అధికారులు!

Tags

Related News

జీఓ నం. 14 ను రద్దు చేయాలని.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్!

ఇళ్లు మంజూరైనా పనులు ప్రారంభించకపోతే రద్దే: మంత్రి పొన్నం ప్రభాకర్!

మేడ్చల్‌లో మిషన్ భగీరథ నీరు రోడ్డుపాలు.. పట్టించుకోని అధికారులు!

పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి అవ్వదు.. కేటీఆర్ గడ్డం పై సీఎం రేవంత్ కౌంటర్!

తెలంగాణ ఖైదీలకు.. కార్పొరేట్ ఉద్యోగాలు ఇప్పిస్తున్న జైళ్ల శాఖ!

రేసుగుర్రం అనుకుంటే కీలుగుర్రంగా మారిన సీఎం రేవంత్: కవిత ఎద్దేవా

రైతులకు బంపర్ ఆఫర్! క్వింటాల్ వరి రూ.5,500? ఎలాగో తెలుసా?!

Big Stories

Advertisement
×