E-Paper
Advertisement

కాంగ్రెస్ పాలనపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన మన్నె క్రిశాంక్!

కాంగ్రెస్ పాలనపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన మన్నె క్రిశాంక్!
Advertisement

Telangana Investments: ఎన్నో సమ్మిట్లు పెట్టారు ఒక్క రూపాయి పెట్టుబడి రాలేదు.. అని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో శనివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎలాంటి నిధుల విడుదల లేదన్నారు. బీసీకార్పొరేషన్ నుంచి కూడా ఎలాంటి నిధులు విడుదల లేదని, కేసీఆర్ ప్రభుత్వం లో దళిత బంధు కోసం నిధులు జమ చేసి పెట్టారన్నారు.

పెట్టుబడులు వచ్చాయా?

రాజీవ్ యువ వికాసం కోసం ఒక్క రూపాయి కూడా పెట్టలేదని అన్నారు. గతంలో కూడా రాహుల్ గాంధీ వచ్చిన భారత్ సమ్మిట్ నుంచి ఒక్క రూపాయి అయిన పెట్టుబడులు వచ్చాయా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఏమైనా పెట్టుబడులు ఇచ్చారా? అమెరికా పోయి ఏమైనా స్వంత కుటుంబ సభ్యులతో ఒప్పందాలు చేసుకున్నారా? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ పెట్టే కేసులలో పస లేదు .మేము ప్రెస్ మీట్ పెట్టగానే పోలీస్ లకు చెప్తారు వస్తారు మమ్ములను బెదిరించి మా కుటుంబ సభ్యులను బెదిరించి ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు.

పరువు నష్టం కేసులో..

Advertisement

నన్ను అరెస్ట్ చేసినప్పుడు నేను కోర్టుకు చెప్పాను క్లియర్ గా టీమ్స్ హాస్పిటల్ పూర్తి కాలేదు కానీ ఆయన మెడికవర్ హాస్పిటల్ లు మాత్రం హెలికాప్టర్ లో వెళ్ళి ఓపెన్ చేశారు అని చెప్పానన్నారు. కోర్టు భేషరతుగా నాపై ఎలాంటి షరతులు లేకుండా రిమాండ్ రిజెక్ట్ చేశారన్నారు. సోమ్ డిస్ట్రిలర్ పరువు నష్టం కేసులో కూడా బీ ఆర్ ఎస్ లీగల్ సెల్ విజయం సాధించిందని తెలిపారు.

Also Read: మేడ్చల్‌లో మిషన్ భగీరథ నీరు రోడ్డుపాలు.. పట్టించుకోని అధికారులు!

Tags

Related News

హామీలు నెరవేర్చాలని పబ్లిక్ ఆస్తులు అమ్ముతారా.. ప్రభుత్వంపై నారాయణరెడ్డి ఫైర్!

పొలం మధ్యలో దర్జాగా గంజాయి సాగు కలకలం.. ఎక్కడంటే?

మేడ్చల్‌లో పౌరసరఫరాల శాఖ దాడులు.. 10 మందిపై క్రిమినల్ కేసులు నమోదు!

మీ ఇంట్లో పాత బట్టలు ఉన్నాయా.. మల్కాజిగిరి మున్సిపాలిటీ వినూత్న ప్రయోగం!

జీఓ నం. 14 ను రద్దు చేయాలని.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్!

ఇళ్లు మంజూరైనా పనులు ప్రారంభించకపోతే రద్దే: మంత్రి పొన్నం ప్రభాకర్!

మేడ్చల్‌లో మిషన్ భగీరథ నీరు రోడ్డుపాలు.. పట్టించుకోని అధికారులు!

Big Stories

Advertisement
×