E-Paper
Advertisement

కరీంనగర్‌కు రానున్న నితిన్ నబీన్.. భారీ పాదయాత్రకు బిగ్ ప్లాన్!

కరీంనగర్‌కు రానున్న నితిన్ నబీన్.. భారీ పాదయాత్రకు బిగ్ ప్లాన్!
Advertisement

Nitin Nabin: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఢిల్లీలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ చేపడుతున్న వివిధ యాత్రలు, కార్యక్రమాల్లో భాగంగా నిజామాబాద్‌లో కూడా పర్యటించి, యాత్ర నిర్వహించాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను కోరారు. కాగా తన విజ్ఞప్తికి నితిన్ నబీన్ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ అర్వింద్ తెలిపారు.

నిజామాబాద్‌లో పర్యటన..

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పార్టీకి ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని, ఇక్కడ పార్టీ కార్యకర్తలు ప్రజలతో మమేకమై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని నితిన్ నబీన్ కు అర్వింద్ వివరించారు. జాతీయ స్థాయి నాయకత్వం నిజామాబాద్‌లో పర్యటించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొనడంతో పాటు, ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యే అవకాశం కలుగుతుందని తెలిపారు. కాగా దీనిపై సానుకూలంగా స్పందించిన నితిన్ నబీన్.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని, పర్యటన తేదీలు, కార్యక్రమాలు ఖరారైన వెంటనే నిజామాబాద్‌లో కూడా యాత్ర నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తానని ఎంపీకి తెలిపారు.

దీపావళి తర్వాత..

Advertisement

జాతీయ అధ్యక్షుడు తన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించడంపై ఎంపీ అర్వింద్ హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ పర్యటన ఖరారైన అనంతరం నిజామాబాద్ పర్యటనకు సంబంధించి తగిన ఏర్పాట్లు, కార్యక్రమాల రూపకల్పనపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటామని తెలిపారు. ఇదిలాఉండగా దీపావళి తర్వాత నితిన్ నబీన్ కరీంనగర్ కు వస్తున్నారు. అయితే అదే రోజు రెండు పాదయాత్రలు కవర్ చేసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ రెండు యాత్రలు కవరయ్యేలా షెడ్యూల్ ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Also Read: పేల్చాల్సిన టైమ్ లో పేల్చకపోతే గన్ రివర్స్ అవుతుంది.. నీతూ వినమ్మా సరిగ్గా!

Tags

Related News

కాంగ్రెస్ పాలనపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన మన్నె క్రిశాంక్!

హామీలు నెరవేర్చాలని పబ్లిక్ ఆస్తులు అమ్ముతారా.. ప్రభుత్వంపై నారాయణరెడ్డి ఫైర్!

పొలం మధ్యలో దర్జాగా గంజాయి సాగు కలకలం.. ఎక్కడంటే?

మేడ్చల్‌లో పౌరసరఫరాల శాఖ దాడులు.. 10 మందిపై క్రిమినల్ కేసులు నమోదు!

మీ ఇంట్లో పాత బట్టలు ఉన్నాయా.. మల్కాజిగిరి మున్సిపాలిటీ వినూత్న ప్రయోగం!

జీఓ నం. 14 ను రద్దు చేయాలని.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్!

ఇళ్లు మంజూరైనా పనులు ప్రారంభించకపోతే రద్దే: మంత్రి పొన్నం ప్రభాకర్!

Big Stories

Advertisement
×