E-Paper
Advertisement

ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. 10 జన్‌పథ్‌లో రాహుల్ గాంధీతో కీలక భేటీ!

ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. 10 జన్‌పథ్‌లో రాహుల్ గాంధీతో కీలక భేటీ!
Advertisement

Mahesh Kumar Goud: ఢిల్లీ వీధుల్లో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం మళ్లీ వేడెక్కింది. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ హుటాహుటిన ఢిల్లీకి చేరుకోవడం ఇప్పుడు గాంధీ భవన్‌తో పాటు రాష్ట్రా వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. 10 జన్‌పథ్‌లో ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఆయన జరిపే ఈ భేటీపైనే అందరి కళ్లూ పడ్డాయి.

పదవుల పంపకంపై సుదీర్ఘ మంతనాలు

Advertisement

ఈ పర్యటన కేవలం మర్యాదపూర్వకమైనది మాత్రమే కాదు. రాష్ట్రంలో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ డైరెక్టర్ పోస్టుల భర్తీపై అధిష్టానంతో రాహుల్ సమక్షంలో స్పష్టత రానుంది. ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడిన క్షేత్రస్థాయి కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు తగిన న్యాయం చేయడమే లక్ష్యంగా టీపీసీసీ చీఫ్ ఒక సమగ్ర నివేదికతో అధిష్టానం ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది.

Advertisement

ఎమ్మెల్సీలు.. వర్కింగ్ ప్రెసిడెంట్ల వేట

దీంతో పాటు అత్యంత కీలకమైన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై రాహుల్ గాంధీ ఫైనల్ ముద్ర పడాల్సి ఉంది. మరోవైపు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంపై కూడా ఈ భేటీలోనే కసరత్తు పూర్తవుతుందని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి, ఈ ఢిల్లీ పర్యటన తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో పలువురు నేతలకు ప్రమోషన్లు దక్కడం, అసంతృప్తులకు చెక్ పడడం ఖాయంగా కనిపిస్తోంది. అధిష్టానం ఇచ్చే గ్రీన్ సిగ్నల్‌తో రాష్ట్రంలో కొత్త పదవుల పండుగ షురూ కానుంది.

Also Read: సిద్దిపేటలో హరీష్ రావు ఖేల్ ఖతం.. డిపాజిట్ కూడా రాదు!- చనగాని దయాకర్

Tags

Related News

సిద్దిపేటలో హరీష్ రావు ఖేల్ ఖతం.. డిపాజిట్ కూడా రాదు!- చనగాని దయాకర్

పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బీభత్సం.. పూర్తిగా నుజ్జైన వాహనం, హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం

గోడకి కన్నం వేసి.. జ్యూవెలరీ షాపునే దోచేశారు, మేడ్చల్‌లో కలకలం

గల్లీలో కేడీ.. ఢిల్లీలో మోదీ.. ఎవరినైనా తొక్కుకుంటూ పోతా!- రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌పై కాలుష్య పంజా.. దీపావళితో భారీగా పడిపోయిన గాలి నాణ్యత!

హైదరాబాద్‌లో కలకలం.. లోన్‌ యాప్‌ వేధింపులతో కానిస్టేబుల్ ఆత్మహత్య

ప్రేమ నిరాకరించడంతో యువతి ఇంట్లో.. ప్రియుడు ఏం చేశాడంటే, వనస్థలిపురంలో దారుణం

Big Stories

Advertisement
×