Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దీపావళి సంబరాలు జరుపుకున్నారు. పేదల ఇళ్లలో వెలుగులు నింపడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. సొంతింటిలో దీపావళి జరుపుకోవడం పేద కుటుంబాలకు ఎంతో సంతోషకరం అని అన్నారు.
ప్రతి నిరుపేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించడమే ప్రభుత్వ సంకల్పమని వెల్లడించారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన ప్రాధాన్యత అని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు స్పష్టం చేసారు. మెదక్ నియోజకవర్గంలో నాలుగు గ్రామాల్లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పర్యటించారు.
హవేలి ఘన్పూర్ మండలం స్కూల్ తాండలో ఇందిరమ్మ లబ్ధిదారులతో పండుగ వేడుకలు జరుపుకున్నారు. లింగసాన్ పల్లి తాండలో లబ్ధిదారుల కుటుంబాలతో ఆత్మీయంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ముచ్చించారు. మెదక్ మండలం శివాయపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల వద్ద దీపావళి సంబరాలు జరుపుకున్నారు. శంకరంపేట్ (ఆర్) మండలం మిర్జాపల్లి తాండలోనూ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పర్యటించారు.
Also read: మరో చిన్నారికి ప్రాణం పోసిన సోనూసూద్.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో!