E-Paper
Advertisement

దీపావళి వేళ బాణాసంచా నిప్పు రవ్వలు.. హైదరాబాద్ సిటీలో పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు, ఆస్తి నష్టం

దీపావళి వేళ బాణాసంచా నిప్పు రవ్వలు.. హైదరాబాద్ సిటీలో పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు, ఆస్తి నష్టం
Advertisement

Hyderabad City: దీపావళి వేళ హైదరాబాద్ సిటీలో వివిధ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించాయి. బాణాసంచా నిప్పులు భారీ అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ సిటీలోని బేగంబజార్‌ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాణాసంచా నిప్పులు పడి మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

దీపావళి వేళ.. హైదరాబాద్ సిటీ భారీ అగ్నిప్రమాదాలు

కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్బెస్టాస్‌ కాలనీలో సోమవారం తెల్లవారుజామున పేపర్‌ టీ కప్పులు, ప్లేట్స్‌ తయారీ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు కాస్త పక్కనే వున్న నెయ్యి, కుర్‌కురే, హల్దీరామ్‌ స్టాక్‌ గోదాములకు వ్యాపించి ఎగిసిపడ్డాయి. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. దాదాపు నాలుగు ఫైర్‌ఇంజిన్లతో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్‌ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు అధికారులు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదుగానీ, భారీగా ఆస్తి నష్టం జరిగింది అంచనా.

Advertisement

పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీపావళి క్రాకర్స్ కాల్చడం వల్ల ప్రమాదం జరిగినట్లు అనుమానం. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. నివాస ప్రాంతాల మధ్య ప్రమాదం జరగడంతో భయాందోళనలో స్థానికులు గురయ్యారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా.

ALSO READ: తిరుపతి పాలిటిక్స్‌లో రచ్చ.. సోషల్ మీడియా ప్రచారాలపై పులివర్తి సుధా రెడ్డి పైర్!

Advertisement

మైలార్‌దేవ్‌పల్లిలో ఈవెంట్ పరికరాల గోదాములో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉడంగడ్డలో ఉన్న ఈవెంట్ పరికరాల గోదాములో ఈ ఘటన జరిగింది. ప్రాథమిక సమాచారం మేరకు.. దీపావళి వేడుకల సమయంలో బాణసంచా నుంచి వచ్చిన నిప్పు రవ్వ అనుకోకుండా గోదాంలో పడింది. అది కాస్త తీవ్రమై అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఘటన గురించి తెలియగానే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చివరకు స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. గోదాం నుంచి భారీ మంటలు, దట్టమైన పొగలు ఎగిసి పడటంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆస్తి నష్టం ఎంత జరిగింది? ఎవరైనా గాయపడ్డారా? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సికింద్రాబాద్ లోని బండిమెట్ లోని డిస్ట్రిబ్యూటర్ డ్రగ్ మార్ట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ధాటికి కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది.

 

 

Related News

దీపావళి బాణాసంచా ఎఫెక్ట్.. సరోజినీ దేవి ఆసుపత్రికి పదుల సంఖ్యలో బాధితులు, పలువురు పరిస్థితి సీరియస్

తిరుపతి పాలిటిక్స్‌లో రచ్చ.. సోషల్ మీడియా ప్రచారాలపై పులివర్తి సుధా రెడ్డి పైర్!

మేడ్చల్ మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్.. భారీగా ఎగిసి పడుతున్న మంటలు!

గద్వాల జిల్లాలో జోరుగా అక్రమ బెల్ట్ షాపుల దందా.. పట్టించుకోని అధికారులు..!

పేదల ఇళ్లలో వెలుగులు నింపడమే మా లక్ష్యం: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు!

హైదరాబాద్‌లో పండుగ పూట తీవ్ర విషాదం.. వైన్ షాప్ వద్ద దాడిలో వ్యక్తి మృతి!

సర్కార్ ఇచ్చే సన్న బియ్యంతో.. భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి!

Big Stories

Advertisement
×