Chandragiri Elections: చంద్రగిరి ప్రజలు మమల్ని గెలిపించారని పులివర్తి సుధా రెడ్డి అన్నారు. ఎక్కడలేని విధంగా తిరుపతి రూరల్ మండలం కౌంటింగ్ జరిగిందని అన్నారు. 24 గంటల పాటు జరిగిన ఈ కౌంటింగ్‌లో మా చెవిరెడ్డి అన్న నానా యాగీ చేశాడని అన్నారు. కౌంటింగ్‌లో మాకు అనుమానాలు ఉన్న మా అభ్యర్థి నిర్ణయం మేరకు వదిలిపెట్టేసి వచ్చేసామని సుదా రెడ్డి అన్నారు.
ఆక్కడున్నా ఆర్ వో ను చెవిరెడ్డి ఇన్ డైరెక్ట్ గా బ్లాక్మెయిల్ చేశాడని అన్నారు. ఆ కోపంతో మేము బయటికి వచ్చి మీడియాతో మాట్లాడానని అన్నారు. లోపల జరిగింది వివరంగా చెప్తే దాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో కావాలని తిప్పుతున్నారని ఫైర్ అయ్యారు. మా అభ్యర్థి ఇంకా ఒప్పుకొని సంతకం పెట్టలేదని క్లారిటీ ఇచ్చారు.
1675 ఇన్వలిడ్ ఓట్లు వచ్చాయి, దాన్ని మేము రికార్డింగ్ అడగకుండా వచ్చేసామని సుదా రెడ్డి అన్నారు. చాలా స్వల్ప తేడాతో గెలిచారని, అధికార దుర్వినియోగం చేసుకొని మేము గెలవలేమా అని ప్రశ్నించారు. కానీ మేము ఆ పని చేయలేదని అన్నారు. అలాంటి సంస్కృతి మాకు లేదు. నాపై సోషల్ మీడియాలో లేనిపోనివి పెడుతున్నారు, అలాంటివి మంచిది కాదని హెచ్చరించారు.
Also Read: మద్యం మత్తులో దాబా వద్ద హంగామా.. డీఈపై సస్పెన్షన్ వేటు!