E-Paper
Advertisement

Drinking Water Supply Hyd: హైదరాబాద్ నగర వాసులకు హెచ్చరిక.. ఆ 24 గంటలు నీటి సరఫరాకు అంతరాయం

Drinking Water Supply Hyd: హైదరాబాద్ నగర వాసులకు హెచ్చరిక.. ఆ 24 గంటలు నీటి సరఫరాకు అంతరాయం
Advertisement

Drinking Water Supply Hyd: హైదరాబాద్ నగరవాసుల కోసం జీహెచ్ఎంసీ కీలక ప్రకటన చేసింది. ఈ విషయాన్ని గమనించి నగరవాసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కూడ సూచించింది. హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1 లోని కొండపాక పంపింగ్ స్టేషన్ వద్దనున్న 3000 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్ కు.. 900 ఎంఎం డయా వాల్వులు బీఎఫ్ అండ్ ఎన్ఆర్వీ అమర్చనున్నారు. ఈ పనులు 17 వతేదీ సోమవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 18 వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయి. ఈ 24 గంటలు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు.

అంతరాయం కలిగే ప్రాంతాలు ఇవే..
☀ ఓ అండ్ ఎం డివిజన్-6 : ఎస్.ఆర్.నగర్, సనత్ నగర్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, వెంగళ్ రావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, ఫతేనగర్.
☀ ఓ అండ్ ఎం డివిజన్-9 : కూకట్ పల్లి, భాగ్యనగర్, వివేకానంద నగర్, ఎల్లమ్మబండ, మూసాపేట్, భరత్ నగర్, మోతీ నగర్, గాయత్రినగర్, బాబా నగర్, కేపీహెచ్ బీ, బాలాజీ నగర్, హస్మత్ పేట్.
☀ ఓ అండ్ ఎం డివిజన్-12 : చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజుల రామారం, సూరారం, ఆదర్శ్ నగర్, భగత్ సింగ్ నగర్, జగద్గిరిగుట్ట, ఉషోదయ.
☀ ఓ అండ్ ఎం డివిజన్-13 : అల్వాల్, ఫాదర్ బాలయ్య నగర్, వెంకటాపురం, మచ్చబొల్లారం. డిఫెన్స్ కాలనీ, వాజ్ పేయ్ నగర్, యాప్రాల్, చాణిక్యపురి, గౌతమ్ నగర్, సాయినాథపురం.
☀ ఓ అండ్ ఎం డివిజన్-14 : చెర్లపల్లి, సాయిబాబా నగర్, రాధికా.
☀ ఓ అండ్ ఎం డివిజన్-15 : కొండాపూర్, డోయెన్స్, మాదాపూర్

Advertisement

Also Read: ఆ భారీ హోర్డింగులను పీకి పడేసిన హైడ్రా.. ఒకటి కాదు రెండు కాదు 50కు పైనే!

☀ ఓ అండ్ ఎం డివిజన్-17 : హఫీజ్ పేట్, మియాపూర్.
☀ ఓ అండ్ ఎం డివిజన్-21 : కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, జవహర్ నగర్, దమ్మాయిగూడ, నాగారం.
☀ ఓ అండ్ ఎం డివిజన్-22 : నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, గండి మైసమ్మ, తెల్లాపూర్, బొల్లారం.
☀ ట్రాన్స్ మిషన్ డివిజన్-4 : ఎంఈఎస్, త్రిశూల్ లైన్స్, గన్ రాక్, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బీబీనగర్ ఎయిమ్స్.
☀ ఆర్ డబ్ల్యూఎస్ ఆఫ్ టేక్స్ ప్రాంతాలు : ప్రజ్ఞాపూర్ గజ్వేల్, ఆలేర్ భువనగిరి, ఘన్ పూర్ మేడ్చల్/ శామీర్ పేట్

Advertisement

ఆయా ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు ముందస్తుగానే తాగు నీటిని అందుబాటులో ఉండేవిధంగా నిల్వ చేసుకోవాలని అధికారులు కోరారు. 24 గంటల అనంతరం మళ్లీ నీటి సరఫరాను పునరుద్దరిస్తామని జీహెచ్ఎంసీ తెలిపింది.

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×