BigTV English

Retro Movie: సూర్య+ బ్రేకప్ సాంగ్.. డెడ్లీ కాంబో.. టైమ్ చూసి దింపారు కదరా

Retro Movie: సూర్య+ బ్రేకప్ సాంగ్.. డెడ్లీ కాంబో.. టైమ్ చూసి దింపారు కదరా

Retro Movie: అది నన్నే నన్నే చేరవచ్చే చెంచలా.. చూడొద్దే నను చూడొద్దే.. అమ్మా అమ్మా  కన్నె  పూవమ్మా.. ఇలా  సూర్య బ్రేకప్ సాంగ్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎంతోమంది బ్రేకప్ అయినవారు ఎక్కువ వినే సాంగ్స్ లో సూర్య  సాంగ్స్ కచ్చితంగా ఉంటాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.  అసలు ఆ విరహ వేదన చూపించడంలో సూర్య సిద్ధహస్తుడు. నటించమంటే  జీవించేస్తాడు. ముఖ్యంగా సన్నాఫ్ కృష్ణన్ సినిమాలోని చెంచలా సాంగ్ లో అయితే నిజంగానే సూర్యకు బ్రేకప్ అయ్యిందా అనేంతలా నటించాడు. ఇప్పటికీ ఆ సాంగ్ బ్రేకప్ బ్రాండ్ అంబాసిడర్ సాంగ్ అని చెప్పొచ్చు. ఇక సూర్య బ్రేకప్ సాంగ్స్ లిస్ట్ లోకి ఇంకోకటి వచ్చి చేరింది.


సూర్య నటిస్తున్న తాజా చిత్రం రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జ్యోతిక – సూర్య నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సూర్య సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీజర్ లోనే ఈ సినిమా కథను కొద్దిగా చెప్పుకొచ్చారు. సూర్య ఒక గ్యాంగ్ స్టర్. అతని తండ్రి దగ్గర పనిచేస్తూ.. అతను ఏది చెప్తే అది చేయడమే సూర్య పని. గొడవలు, వివాదాలు, పంచాయితీలు చెప్తూ రక్తపాతం సృస్టిస్తూ ఉంటాడు. ఇక దీనికి తోడు  సూర్యకు కోపం ఎక్కువ.  ఆ సమయంలోనే సూర్య  లైఫ్ లోకి పూజా వస్తుంది.  ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇవన్నీ మానేస్తున్నట్లు మాట ఇవ్వడాన్ని టీజర్ లో చూపించారు. 

Akkineni Nagarjuna: ఆ విషయంలో నాగ్ ఎప్పుడు కింగే.. తల సినిమాకు సాయం


ఇక ఇప్పుడు రెట్రో నుంచి బ్రేకప్ సాంగ్ ను రిలీజ్ చేశారు. కన్నాడి పూవే అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కేవలం తమిళ్ లోనే ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు.  ఇక ఈ సాంగ్  సూర్య సన్నాఫ్ కృష్ణన్ లోని చెంచాల సాంగ్ ను గుర్తుచేస్తుంది. ఆ లుక్ కూడా సేమ్ అలానే కనిపిస్తుండడంతో.. డ్యాన్స్ వింటేజ్ మోడ్ కు వెళ్లిపోయారు. ఇక పూజకు మాట ఇచ్చిన తరువాత కూడా సూర్య  పంచాయితీలు చేయడం మానలేదని, వాటివలనే అతనిని జైల్లో పెట్టినట్లు వీడియోలో తెలుస్తోంది. ఇక జైల్లో పూజా బొమ్మను గీస్తూ.. ఆ ప్రేమ విరహాన్ని పాట రూపంలో చూపించారు.

ఇక బ్రేకప్ సాంగ్స్ అంటే సూర్య యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇందులో కూడా అసలు తగ్గేదేలే అన్నట్లు నటించాడు. పూజాను తలుచుకొని గుండెలను కొట్టుకుంటూ తమ ప్రేమ విరహాన్ని చూపించాడు. ఇక ఈ సాంగ్ కు వివేక్ లిరిక్స్ అందించగా.. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించడంతో పాటు ఆయనే ఆలపించి మెస్మరైజ్ చేశాడు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.

రేపు వాలెంటైన్స్ డే. ఈరోజు సూర్య ఇలాంటి సాంగ్ రిలీజ్ చేయడంతో.. బ్రేకప్ అయినవారందరూ.. ఈ సాంగ్ తో రేపు రచ్చ చేయడానికి రెడీ అవుతున్నారు. ఎవరైనా ప్రేమికుల రోజున.. రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేయాలి కానీ.. వీరేంట్రా సాద్ సాంగ్ ను రిలీజ్ చేసారని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.  ఇంకొంతమంది మాత్రం టైమ్ చూసి దింపారు అని చెప్పుకొస్తున్నారు. మే 1 న రెట్రో ప్రేక్షకుల ముందుకు రానుంది.  మరి ఈ సినిమాతో సూర్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×